Jessie Shocking Comments On Siri And Shanmukh Relationship: బిగ్‌బాస్ షోలో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు బెస్ట్‌ఫ్రెండ్స్‌లా ఉన్నవాళ్లు కూడా హౌస్‌లో బద్ద శత్రువులుగా మారొచ్చు.. ఏ పరిచయం లేని వాళ్లు సైతం హస్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మరొచ్చు. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్-5లో షణ్ముఖ్, సిరిలు కూడా పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా..వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ విషయాన్ని లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లో సిరి స్వయంగా ఒప్పుకుంది. తప్పు అని తెలిసినా కనెక్షన్ పెరుగుతుందంటూ మనసులో మాటను బయటపెట్టింది.
వీరిద్దరూ సింగిల్‌గా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ.. బిగ్‌బాస్‌కు రాకముందే సిరి శ్రీహాన్‌తో నిశ్చితార్థం జరగడం, కొన్నాళ నుంచి దీప్తి సునయనతో షణ్నూ ప్రేమలో ఉండటంతో వీరిద్దరి రిలేషన్‌ను నెటిజన్లు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పబ్లిక్‌గా హద్దులు మీరి హగ్గులు, కిస్సులు ఇచ్చుకోచడం ఫ్యామిలీ ఆడియోన్స్‌ను సైతం రుచించడం లేదు.
ఇక వీరిద్దరి రిలేషన్‌పై బిగ్‌బాస్ కంటెస్టెంట్ జెస్సీ మాట్లాడుతూ.. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్లతోనే క్లోజ్‌గా ఉంటారని, కానీ బయటకు వచ్చాక అది కంటిన్యూ కాదని అభిప్రాయపడ్డాడు. ఇక షణ్నూ కోసం సిరి తలను గోడకేసి గుద్దుకోవడం తనకు ఏమాత్రం నచ్చలేదని, ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే..సిరి చెంప పగులకొట్టేవాడినంటూ కామెంట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment