Jessie Remuneration: Bigg Boss 5 Telugu Jessie Remuneration Revealed - Sakshi
Sakshi News home page

Jessie: పది వారాలకు గాను జెస్సీ అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?

Nov 15 2021 5:29 PM | Updated on Nov 16 2021 9:51 AM

Bigg Boss Telugu 5: Model Jessie Remuneration Revealed - Sakshi

Jessie Remuneration Revealed: పది వారాలకు గాను జెస్సీ ఎన్ని లక్షలు వెనకేసుకున్నాడో తెలిసిపోయింది.

Bigg Boss Telugu 5: Model Jessie Remuneration Revealed: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్‌ జెస్సీ అనూహ్యంగా హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు. అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు.  వారం రోజులుగా సీక్రెట్‌ రూంలోనే ఉన్న జెస్సీ కోలుకొని రీఎంట్రీ ఇస్తాడని భావించినా వర్టిగో వ్యాధి తీవ్రం అవుతుండటంతో బిగ్‌బాస్‌ షో మధ్యలోంచి అతను డ్రాప్‌ అవ్వాల్సి వచ్చింది.

దీంతో నామినేషన్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్‌ సేఫ్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ నుంచి వెళ్లేముందు కంటెస్టెంట్లకు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. దీంతో ప్రేక్షకుల కన్నా మరింత క్షుణ్ణంగా జెస్సీ అబ్జర్వ్‌ చేసిన ఉంటాడని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

కాగా పది వారాలకు గాను జెస్సీకి ఎంత ముట్టిందన్నది సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జెస్సీకి వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన పది వారాలకు గాను మొత్తం రూ. 10 -15 లక్షల వరకు వెనకేసుకున్నట్లు అంచనా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement