
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది ఓ వరం. ఆ వరాన్ని అందుకోవడం కోసం ఎన్ని పాట్లైనా పడతారు కంటెస్టెంట్లు. అయితే కెప్టెన్ అవడం కోసం పడే కష్టం ఒక ఎత్తైతే కెప్టెన్‌గా నిరూపించుకోవడం మరో ఎత్తు. హౌస్‌లో ఏ చిన్న గొడవ జరిగినా, పనుల పంపకాల్లో తేడాలు వచ్చినా, రూల్స్ సరిగా పాటించకపోయినా అందరూ కెప్టెన్ వైపే వేలు చూపిస్తారు. గత వారం కెప్టెన్ అయిన జెస్సీ నాయకత్వంలో విఫలమయ్యాడు. తను చెప్పిన మాటలను ఇంటిసభ్యులు పట్టించుకోకపోవడంతో బిగ్‌బాస్ ఆగ్రహానికి గురయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ఇంట్లోని ఆహారాన్ని మొత్తం పంపించేయాలని చెప్పినప్పుడు లోబో అందుకు ఒప్పుకోలేదు. అయితే అతడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హౌస్ కెప్టెన్‌గా బిగ్‌బాస్ ఆదేశాన్ని శిరసావహిస్తూ ఫుడ్ మొత్తాన్ని పంపించి తీరాల్సిందే! కానీ తినే ఫుడ్ లాక్కునేందుకు మానవత్వం అడ్డురావట్లేదా? అని హౌస్‌మేట్స్ భారీ డైలాగులు కొట్టడంతో సైలెంట్ అయిపోయాడు. ఇదే అతడి కొంప ముంచింది.
తన ఆదేశాలను ధిక్కరించినందుకుగానూ బిగ్‌బాస్ జెస్సీతో పాటు, ఆ టాస్క్‌లో అతడితో జోడీ కట్టిన కాజల్‌పై అనర్హత వేటు వేశాడు. దీంతో ఈ ఇద్దరూ కెప్టెన్సీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కూడా చాలామంది జెస్సీనే తప్పుపట్టారు. కెప్టెన్‌గా బిగ్‌బాస్ ఆదేశాలను మాత్రమే పట్టించుకోవాలని, ఇంటిసభ్యుల మాటలు చెవికెక్కించుకోరాదని చురకలు అంటించారు. అతడి వైఫల్యం వల్లే అనర్హత వేటు పడిందని కామెంట్ చేశారు. కెప్టెన్ అంటే కమాండింగ్ ఉండాలని, జెస్సీ అందులో విఫలమయ్యాడని పెదవి విరిచారు. అంతేకాదు, ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్‌లను ఎన్నుకోమని బిగ్‌బాస్ ఆదేశించగా చాలామంది జెస్సీ పేరునే సూచించారట! దీంతో తొలివారంలోనే జైలు జీవితం గడిపిన అతడు మరోసారి ఊచలు లెక్కబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment