
ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ లీకువీరులు అన్ని విషయాలను ముందుగానే నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ వీరికి పోటీగా..
Bigg Boss 5 Telugu: Jessie New Captain: బిగ్‌బాస్‌లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఎవరు కెప్టెన్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న విషయాలను తెలుసుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ లీకువీరులు అన్ని విషయాలను ముందుగానే నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇది చాలదన్నట్లు స్వయంగా బిగ్‌బాసే వీరికి పోటీగా దిగినట్లు కనిపిస్తోంది. ఈ వారం ఎవరు కెప్టెన్ అయ్యారన్న విషయాన్ని ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పేశాడు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఫస్ట్ లవ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయిన ప్రోమోలో మోడల్ జశ్వంత్ చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో జెస్సీ ఈ వారం కెప్టెన్ అయ్యాడని స్పష్టమవుతోంది. అయితే అంత పెద్ద విషయాన్ని అంత ఈజీగా లీక్ చేశాడేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎడిటర్ నిద్రపోయినట్లున్నాడు అంటూ ఛలోక్తులు విసురుతున్నారు. ఏదేమైనా జెస్సీ కెప్టెన్‌గా అవతరించి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని మరికొందరు మెచ్చుకుంటున్నారు.