
Bigg Boss 5 Telugu Promo, Final Fight For Captaincy: కెప్టెన్సీని దక్కించుకునేందుకు కొట్టుకోవడానికి కూడా వెనుకాడట్లేదు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. తాజాగా హౌస్‌లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో పెద్ద రగడ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో శ్రీరామ్.. సన్నీ, మానస్‌ను ఓడించేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
అయితే సంచాలకుడైన జెస్సీ సర్కిల్ దాటి బయటకు వచ్చిన శ్రీరామ్, మానస్ ఇద్దరూ ఔట్ అని ప్రకటించాడు. కానీ అంతలోనే మాట మారుస్తూ శ్రీరామ్ ఇంకా ఆటలోనే ఉన్నాడని, అతడు కొనసాగొచ్చని వెల్లడించాడు. దీంతో షాకైన సన్నీ.. ఇద్దరూ ఔట్ అని చెప్పాక మళ్లీ కొత్తగా ఇదేంటని ఫైర్ అయ్యాడు. ఆవేశంతో జెస్సీ ముందున్న సంచిని కాలితో తన్నాడు. అతడి చర్యకు చిర్రెత్తుకొచ్చిన జెస్సీ.. కాలితో కొడతావేంటి? పెద్ద పోటుగాడిలాగా! అంటూ మండిపడ్డాడు. మరి జెస్సీ నిజంగానే గేమ్‌లో పక్షపాతం చూపించాడా? లేదా అనవసరంగా సన్నీ, మానస్ అతడితో గొడవకు దిగుతున్నారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే!