షణ్ముఖ్‌, సిరితో గొడవలు.. నా ఫోన్‌ కట్‌ చేస్తున్నారు.. జెస్సీ | Bigg Boss Contestant Model Jessie About Shanmukh Jaswanth and Siri Hanmanth | Sakshi
Sakshi News home page

Model Jessie: షణ్ముఖ్‌ నన్ను అన్‌ఫాలో చేశాడు, చాలామంది నన్ను తిట్టారు..

Published Fri, Mar 3 2023 9:48 PM | Last Updated on Fri, Mar 3 2023 9:53 PM

Bigg Boss Contestant Model Jessie About Shanmukh Jaswanth and Siri Hanmanth - Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో షణ్ముఖ్‌- సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇద్దరికీ బయట ప్రేమికులు ఉన్నా కూడా హౌస్‌ లోపల మాత్రం నీకు నేను, నాకు నువ్వు అన్నట్లుగా మెదిలారు. వీరి అతి ప్రేమను చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. అటు సిరి ప్రియుడు శ్రీహాన్‌ కూడా ఓసారి స్టేజీపైకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తున్నవారా? అని ఎంతో దీనంగా అడిగిన డైలాగ్‌ ఇప్పటికీ బిగ్‌బాస్‌ ఆడియన్స్‌ మర్చిపోలేరు. అయితే షణ్ను, సిరిలతో మోడల్‌ జెస్సీ క్లోజ్‌గా ఉండేవాడు. మిగతా హౌస్‌మేట్స్‌ ఈ ముగ్గురిలో ఎవరినైనా ఒక్క మాట అంటే చాలు మిగతా ఇద్దరూ రెచ్చిపోయి గొడవ చేసేవారు. కానీ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాక సీన్‌ మారింది. ఎవరి దారి వారు చూసుకున్నారు. అంతేకాదు ఎంతో స్నేహంగా మెదిలినవాళ్లే ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.

ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో జెస్సీ మాట్లాడుతూ.. 'నాకు బాగా క్లోజ్‌ అయినవాళ్లకు ఐ లవ్యూ చెప్తుంటాను. కానీ వాళ్లు(సిరి, షణ్ముఖ్‌) ఆ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఒక్కసారి ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడ్డాక అంత ఈజీగా తెగిపోతుందని నేను ఊహించలేదు. చెప్పుడు మాటలు విని దూరం పెట్టారు. చాలా బాధేసింది. నాకు ఫోన్‌ చేసి ఇలా అంటున్నారు, నిజమా? కాదా? అని అడిగి తిట్టే స్వతంత్రం వారికుంది. నేను తప్పు చేశానంటే కచ్చితంగా ఒప్పుకుంటాను. వీళ్లకి అర్థం కాని విషయం ఏంటంటే.. ఒకప్పుడు వాళ్లను ఛీ, తూ.. అన్నవాళ్ల దగ్గరకే వెళ్తున్నారు. వాళ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అది తెలుసుకుంటే మంచిది. నేను ఫేమస్‌ అవ్వడానికి వాళ్లను వాడుకుంటున్నానని టాక్‌ వచ్చింది. నాకంత అవసరం లేదు, అయినా షణ్ముఖ్‌ అంత పిచ్చోడేం కాదు. వాడికి ఫలానా వాడు ఫేక్‌ అనిపిస్తే వదిలేస్తాడు. బిగ్‌బాస్‌ షోలో నాకోసం ఏడ్చాడు. నాలుగో వారంలో నన్ను జైల్లో పెట్టినప్పుడు నేను నిన్ను నమ్ముతానురా అని నాతో కూర్చున్నాడు. నేను ఫేక్‌గా లేను కాబట్టే నాతో ఉన్నాడు.

కానీ ఇప్పుడు నా ఫోన్‌ కట్‌ చేసేంత స్థితికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఒకరిని ఫ్రెండ్‌ అనుకున్నానంటే ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తాను. వారికిప్పుడు నా ప్రవర్తన నచ్చడం లేదంటే సరే! షణ్ను నన్ను అన్‌ఫాలో కొట్టాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. బాధేసింది. కొందరైతే నేనేదో తప్పు చేసినట్లు కామెంట్లలో నన్ను తిట్టేవాళ్లు. వాడికి నా పిల్లచేష్టలు, ప్రవర్తన నచ్చలేదని దూరం పెట్టాడేమో! నావంతు ప్రయత్నం చేశాను. కలిశా, అడిగా, సంవత్సరం వెయిట్‌ చేశా.. కానీ వాళ్లు వద్దనుకుంటున్నారు. ఒకానొక సమయంలో నాకూ కోపమొచ్చింది. వారు నన్ను ఇష్టపడనప్పుడు ఎందుకు వెనకపడటం అనిపించింది. అందుకే నేనూ దూరంగా ఉంటున్నాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement