
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హింసకు తావు లేదని బిగ్‌బాస్ గతంలోనే హెచ్చరించినా కంటెస్టెంట్లు మరోమారు ఆ మాటను పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ టాస్కులో హౌస్‌మేట్స్ దెబ్బలు తాకినా, రక్తాలు కారినా తగ్గేదేలే అన్న రీతిలో పోరాడుతున్నారు.
ఈ వారం బిగ్‌బాస్ 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా.. యువరాజులుగా ఉన్న రవి, సన్నీ సింహాసనాన్ని అధిష్టించేందుకు పోటీపడతారు. మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకు నచ్చిన యువరాజుకు సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో టాస్కులు కొనసాగేకొద్దీ కొందరు ప్రజలు తమ యువరాజుకు మద్దతును ఉపసంహరించుకునేందు ప్రయత్నిస్తుండగా మరికొందరు పట్టపగలే ఖజానాను దొంగిలించేందుకు యత్నించారు. ఇది చూసిన శ్వేత.. 'ఇంకా గేమ్ ఎందుకు ఆడటమో' అని సెటైర్ వేసింది.
మరోవైపు సన్నీ వర్సెస్ రవి అని రాసి ఉన్న బోర్డులపై యువరాజుల ఫొటోలు పెట్టి ఉండగా హౌస్‌మేట్స్ దాన్ని విసిరి పారేసేందుకు తీవ్రంగా శ్రమించారు. బోర్డులను కింద పడేస్తూ అల్లకల్లోలం సృష్టించారు. జెస్సీ అయితే ఏకంగా శ్రీరామచంద్రను ఎత్తి పడేసినట్లు కనిపించింది. మరీ ఇంత అరాచకంగా మారిన ఈ గేమ్‌లో ఏ యువరాజును ఎవరెవరు గెలిపించారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment