
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ట్రోఫీ.. హౌస్‌లో ఉన్న అందరి కళ్లు ఇప్పుడు దాని మీదే ఉన్నాయి. ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అని కసిమీదున్నారు కంటెస్టెంట్లు. ఇప్పటిదాకా టాప్ 5లో చోటు సంపాదించడం కోసం కష్టపడ్డ హౌస్‌మేట్స్.. తమకు టైటిల్‌ను సొంతం చేసే బాధ్యతను అభిమానుల భుజాలపై వేశారు. ఈ వారం ప్రేక్షకులు వేసే ఓట్లతో విన్నర్ ఎవరనేది డిసైడ్ కానుంది.
ఇదిలా ఉంటే ఫైనలిస్టులకు బిగ్‌బాస్ వారి జర్నీ వీడియోలు చూపించాడు. ఆనందపు క్షణాలతో పాటు మర్చిపోలేని మధురానుభూతులను బాధాకరమైన సంఘటలను, పోట్లాటలను.. ఇలా అన్నింటినీ ఏవీ వేసి చూపించడంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. 'ఈ ఇంట్లో మీ ప్రయాణం గాయకుడిగా మొదలైంది. ఒక్కోవారం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆటలో మీరు చూపించిన పటిమ, స్నేహితుల కోసం నిలబడ్డ తీరు ప్రపంచానికి ఒక కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ముంచే కెరటాలు ఎన్ని ఉన్నా వాటిపై ఈదుకుంటూ వచ్చి ఉదయించే సూర్యుడు ఒక్కడే..' అంటూ శ్రీరామ్‌ను మెచ్చుకున్నాడు బిగ్‌బాస్.
'స్నేహం కోసం మీరు నిలబడ్డ తీరు ప్రతిఒక్కరినీ హత్తుకుంది. కొందరు తెలివితో మరికొందరు మనసుతో ఆడతారు. కానీ మీరు మనసు, తెలివిని సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమైంది' అని మానస్‌పై ప్రశంసలు కురిపించాడు బిగ్‌బాస్.