బరాబర్‌ కప్పు గెలుస్తా, అమ్మకు ఇస్తా: సన్నీ ధీమా | Bigg Boss Telugu 5: VJ Sunny Confident On His Winning | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బరాబర్‌ కప్పు గెలుస్తా, అమ్మకు ఇస్తా: సన్నీ

Published Mon, Dec 13 2021 11:52 PM | Last Updated on Tue, Dec 14 2021 12:09 AM

Bigg Boss Telugu 5: VJ Sunny Confident On His Winning - Sakshi

Bigg Boss Telugu 5, Episode 100: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ నేటితో సెంచరీ కొట్టింది. ప్రస్తుతం ఉన్న సిరి, మానస్‌, శ్రీరామ్‌, షణ్ను, సన్నీలు గ్రాండ్‌ ఫినాలే కోసం రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మానస్‌- సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ.. 'టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్‌ గెలవాలి, మా అమ్మకు కప్‌ ఇస్తరా బయ్‌.. ఇది ఫిక్స్‌.. ఏదైనా కానీ.. బరాబర్‌ కప్పు ఇస్తా..' అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం బిగ్‌బాస్‌ ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు. మొదటగా ఫస్ట్‌ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. అతడు గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు.

అనంతరం బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. ఆట సాగుతున్నకొద్దీ మీకు దగ్గరైనవారు ఒక్కొక్కరిగా మీకు దూరమయ్యారు. ఎంతోమంది మిమ్మల్ని లోన్‌ రేంజర్‌ అన్నా మీరు వన్‌ మ్యాన్‌ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. ఇది చూసి శ్రీరామ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్‌ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్‌ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్‌ అవకాశమివ్వగా శ్రీరామ్‌ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు.

తర్వాత మానస్‌ గార్డెన్‌ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం మీకే చెల్లింది.  మనసు, తెలివి రెండింటినీ సమంగా ఉపయోగించి ఆడటం మీతోనే సాధ్యమం అని మెచ్చుకుంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్‌. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు, స్వీట్‌ అండ్‌ సాడ్‌ మెమొరీస్‌ చూసి మానస్‌ కదిలిపోయాడు. తర్వాత ఒక ఫొటోగ్రాప్‌ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్‌ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు. ఇది చూసిన శ్రీరామ్‌ తానూ రెండు ఫొటోలు తెచ్చుకోవాల్సిందని నిరాశ చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement