Bigg Boss Telugu 5: Top 5 Contestants of BB5 Telugu - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: టాప్‌ 5కి చేరుకునే కంటెస్టెంట్లు వీళ్లే!

Dec 4 2021 4:49 PM | Updated on Dec 5 2021 11:56 PM

Bigg Boss Telugu 5: Top 5 Contestants of BB5 Telugu - Sakshi

షణ్ముఖ్‌, సన్నీ, శ్రీరామ్‌ టాప్‌ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి..

Bigg Boss 5 Telugu, Top 5 Finalists: టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ ఏమోకానీ సిరి, శ్రీరామ్‌ ఇప్పటికీ తమంతట తాము నడవలేక నానా అవస్థ పడుతున్నారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప సరిగ్గా నిలబడలేకపోతున్నారు. రెండుమూడురోజులుగా కాళ్లకు కట్లు కట్టుకుని కుర్చీల్లోనే కూర్చుండిపోయారు. అలా అని టికెట్‌ టు ఫినాలేను గాలికి వదిలేయలేదు. కూర్చుని ఆడే గేమ్స్‌ స్వయంగా వాళ్లే ఆడారు కానీ ఫిజికల్‌ టాస్కుల్లో మాత్రం ఇతరుల సాయం తీసుకున్నారు. అలా సిరి రెండుసార్లు షణ్ను హెల్ప్‌ తీసుకోగా శ్రీరామ్‌.. షణ్ను, సన్నీ ఇద్దరి సాయం తీసుకున్నాడు. వాళ్లిద్దరి సాయంతో చివరి రౌండ్‌కు చేరుకున్న శ్రీరామ్‌ ఫైనల్‌లో మాత్రం అతడే ఆడి టికెట్‌ టు ఫినాలే గెలిచాడు. అలా ఈ సీజన్‌లో టాప్‌ 5లో బెర్త్‌ కన్‌ఫార్మ్‌ చేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించాడు.

అయితే శ్రీరామ్‌తో పాటు ఎవరెవరు ఫినాలేలో అడుగు పెడతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. షణ్ముఖ్‌, సన్నీ, శ్రీరామ్‌ టాప్‌ 3లో ఉంటారని నెటిజన్లు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ శ్రీరామ్‌ను వెనక్కి నెట్టి మానస్‌ టాప్‌ 3లో చోటు దక్కించుకునే ఛాన్స్‌ ఉంది. లేదంటే అతడు నాలుగో స్థానానికి పరిమితమయ్యేట్లు కనిపిస్తోంది. చివరి స్థానంలో లేడీ కంటెస్టెంట్‌ నిలిచేందుకు ఆస్కారం ఉంది.

అయితే ఆ స్థానాన్ని సిరి, కాజల్‌లో ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఊహించని ఎలిమినేషన్లతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈ రెండు వారాలు ఎలిమినేషన్‌ను తప్పించుకునే కంటెస్టెంట్‌ ఫినాలేకు వెళ్తుంది. ఒకవేళ సిరి ఎలిమినేట్‌ అయితే మాత్రం ఫినాలేలో అడుగుపెట్టాలన్న కాజల్‌ కోరిక నెరవేరుతుంది. మరోపక్క ఈ వారం పింకీ వెళ్లిపోతుందని అనఫీషియల్‌ ఓటింగ్స్‌ చెప్తున్నాయి. ఒకవేళ అది నిజం కాకపోతే కాజల్‌ బయటకు వచ్చేస్తుందంటున్నారు. ఈ వారం జరగనున్న ఎలిమినేషన్‌తో టాప్‌ 5లో ఎవరుంటారనేదానిపై ఓ స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement