Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ కథ కంచికి చేరుకుంటోంది. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ ప్రయాణంలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరంతా ఎవరికి వారు టాప్ 5కి చేరుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే తమలో నుంచి ఒకరిని పంపించే నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈమేరకు తాజా ప్రోమో రిలీజైంది.
ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై భగ్గుమని లేచాడు శ్రీరామ్. అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్.. నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించాడు.
తర్వాత సన్నీతోనూ పోట్లాటకు దిగాడు. సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు. అంతెందుకు, నేను, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్.. ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా.. 'ఆ గ్రూపుకు నేను లీడర్‌ను' అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. ఇదిలా వుంటే కెప్టెన్ మానస్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం!
Comments
Please login to add a commentAdd a comment