అగ్ని పరీక్ష.. ఛీ కొట్టిన పింకీ, చిందులు తొక్కిన షణ్ముఖ్‌ | Bigg Boss Telugu 5: Sixth Week Nominations Contestants Are In Fire | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: దొంగనాటకాలు ఆడకు.. యానీ మాస్టర్‌ ఉగ్రావతారం

Oct 12 2021 12:23 AM | Updated on Oct 12 2021 8:36 AM

Bigg Boss Telugu 5: Sixth Week Nominations Contestants Are In Fire - Sakshi

కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది.

Bigg Boss Telugu, Episode 37: హమీదా వెళ్లిపోయాక శ్రీరామచంద్ర కాస్త డల్‌ అయిపోయినట్లు కనిపించింది. అర్ధరాత్రి నిద్రలో కూడా ఏవేవో కేకలు వేయడంతో ఇంటిసభ్యులు ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న విశ్వ.. అతడి పరిస్థితి అర్థమై అతడి వీపు నిమురుతూ నిద్రపుచ్చాడు. మరోపక్క నామినేషన్స్‌లో ఎలా ఫైట్‌ చేయాలా? సిరి, జెస్సీ, షణ్ముఖ్‌ చర్చించుకున్నారు. ఏదేమైనా సరే,  అతడికి రివర్స్‌ కౌంటరివ్వు, ఏం కాదంటూ సిరిని శ్రీరామ్‌ మీదకు ఉసిగొల్పాడు షణ్ముఖ్‌. మరోపక్క కెప్టెన్‌, రేషన్‌ మేనేజర్‌కు అస్సలు పడటం లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. రేషన్‌ మేనేజర్‌గా నువ్వు ఫెయిలయ్యావంటూ విశ్వ ముఖం మీదే చెప్పేసింది ప్రియ. అంతేకాకుండా అందరికీ గిన్నెల్లో వేసి పెట్టిన తర్వాతే తినాలని అతడిని ఆదేశించింది.

కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష
అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్‌ మొదలయ్యాయి. నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను 'అగ్నిపరీక్ష' టాస్క్‌లో బయటపెట్టాలన్నాడు బిగ్‌బాస్‌. మొదటగా వచ్చిన సన్నీ.. రవి, జెస్సీ ఫొటోలను మంటలో వేశాడు. తర్వాత వచ్చిన విశ్వ.. ఎంతో కష్టపడి బిగ్‌బాస్‌కు వచ్చిన తనను స్ట్రాంగ్‌ అంటూ పదేపదే నామినేట్‌ చేయడం నచ్చలేదంటూ యానీ మాస్టర్‌ ఫొటోను నిప్పులో పడేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యానీ ఉగ్రావతారం ఎత్తింది. ఇకపై తనను అక్క అని పిలవద్దంటూ వార్నింగ్‌ ఇచ్చింది. తర్వాత అతడు ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు.

నా గేమ్‌ నా ఇష్టం, నాకు నీతులు చెప్పకు: సిరి
శ్వేత.. సిరి, కాజల్‌ను నామినేట్‌ చేసింది. అనంతరం లోబో వంతు రాగా.. నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని చంపారంటూ ప్రియాంక సింగ్‌, జెస్సీని నామినేట్‌ చేశాడు. దీనిపై జెస్సీ రియాక్ట్‌ అవుతూ.. నమ్మకంతో తనకు పని లేదని, గేమ్‌ ఆడటానికి వచ్చానని సమాధానమిచ్చాడు. సిరి మాట్లాడుతూ.. నీ కెప్టెన్సీలో పక్షపాతం కనిపించిందంటూ శ్రీరామచంద్రను నామినేట్‌ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. నా గేమ్‌ నా ఇష్టం, ఏం చేయాలో నాకు సూక్తులు చెప్పకంటూ చిర్రెత్తిపోయింది. యాంకర్‌ రవి.. కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్‌ చేయలేదని మానస్‌ను నామినేట్‌ చేశాడు. జనాలను ఎంటర్‌టైన్‌ చేయాలని తాను, లోబో బిగ్‌బాస్‌కు వచ్చామని, కానీ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ సిరి ఫొటోను కాల్చి బూడిద చేశాడు.

విశ్వను ఛీ కొట్టిన పింకీ, నవ్వాపుకున్న ప్రియ
జెస్సీ.. శ్రీరామ్‌, సన్నీని నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ, సన్నీ మధ్య పెద్ద ఫైటే నడిచింది. నేను గేమ్‌ ఆడితే తట్టుకోలేవు, నా మంచితనం పోతే చాలా వరస్ట్‌గా ఉంటుంది అని హెచ్చరించాడు సన్నీ. ప్రియాంక సింగ్‌ మాట్లాడుతూ.. ప్రతిసారి సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేయడమే కాకుండా నమ్మకం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ లోబో ఫొటోను నిప్పుల్లో వేసింది. విశ్వ గురించి మాట్లాడుతూ.. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది. ఇదంతా చూసి ప్రియ నవ్వాపుకోవడం గమనార్హం. మానస్‌.. యాంకర్‌ రవి, లోబోను నామినేట్‌ చేశాడు. యానీ మాస్టర్‌.. మరోసారి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌నే నామినేట్‌ చేస్తానంటూ షణ్ముఖ్‌ ఫొటోను నిప్పుల్లో పడేసింది. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకు, వెనకాల నుంచి పొడవకు అని హెచ్చరిస్తూ విశ్వ ఫొటోను కాల్చివేసింది.

అందుకోసం నేను బిగ్‌బాస్‌కు రాలేదు: కాజల్‌
తర్వాత శ్రీరామ్‌ వంతురాగా.. మీ అవసరానికి తగ్గట్టు రిలేషన్‌షిప్‌ వాడుకోవద్దని సూచిస్తూ సిరిని నామినేట్‌ చేశాడు. ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్‌నెవరూ నామినేట్‌ చేయడంలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు. ఈ క్రమంలో నిప్పులు తొక్కిన షణ్ను బిగ్‌బాస్‌ హౌస్‌కు నువ్వు దేవుడివి, నువ్వేం చెప్తే అది చేయాలా? అని ఫైర్‌ అయ్యాడు. దీంతో శ్రీరామ్‌ అతడికి కూల్‌ చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత కాజల్‌ మాట్లాడుతూ.. హమీదా నన్ను అక్కా అంటూ పిలిచింది కానీ నేను కనెక్ట్‌ కాలేకపోయా.. నేను నిన్ను బ్రదర్‌ అంటూ మాట్లాడదామని ముందుకు వస్తే నువ్వు కనెక్ట్‌ అవ్వలేదు. ఇదే కర్మ.. ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, కేవలం గేమ్‌ ఆడటానికే వచ్చానని తేల్చి చెప్పింది కాజల్‌. తనను నామినేట్‌ చేసినందుకు శ్వేత ఫొటోను నిప్పుల్లో వేసింది.

అందరికీ పెట్టాకే తినాలి: ప్రియ
ప్రియ.. నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు, టక్కున నోరు జారేస్తావు. రేషన్‌ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరికీ పెట్టాకే తినాలి అంటూ విశ్వను నామినేట్‌ చేసింది. తర్వాత సన్నీ ఫొటోను మంటల్లో వేసింది. ప్రతివారం తనను నామినేట్‌ చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు సన్నీ. మీరున్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్‌ చేస్తానంటూ ప్రియను హెచ్చరించాడు. మొత్తంగా ఈ వారం షణ్ముఖ్‌, ప్రియాంక సింగ్‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement