సిరికి చుక్కలు చూపించిన అరియానా.. ప్రతి ప్రశ్నలో కౌంటర్‌ అటాక్‌ | BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss Buzz : చోటు, షణ్నూల్లో ఎవరిని సెలక్ట్‌ చేసుకుంటావ్‌ అని అడిగిన అరియానా

Published Mon, Dec 20 2021 5:03 PM | Last Updated on Mon, Dec 20 2021 5:50 PM

BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside - Sakshi

BB5 Siri Bigg Boss Buzz Interview With Ariyana, Check Promo Inside: బిగ్‌బాస్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్న లేడీ కంటెస్టెంట్‌ సిరి. మొదటి నుంచి అబ్బాయిలకు సమానంగా గట్టి పోటీ ఇచ్చిన సిరి ఒక దశలో టాప్‌-3 ఉంటందనుకున్నారు. కానీ షణ్నూతో మితిమీరిన హగ్గులతో విపరీతంగా ట్రోల్స్‌ బారిన పడింది. పైకి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పినా జనాలకు మాత్రం వీరి మధ్య ఇంకేదో రిలేషన్‌ ఉందని గట్టిగా ఫిక్స్‌ అయ్యేలా ప్రవర్తించారు. దీంతో అప్పటివరకు వీళ్లకు సపోర్ట్‌ చేస్తూ వచ్చిన వాళ్లు సైతం సైడయ్యారు.

ఇక హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం అరియానాతో బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా సన్నీని కావాలనే టార్గెట్‌ చేశావా అన్న ప్రశ్నకు లేదు అని ఆన్సర్‌ ఇచ్చింది. టాస్కుల్లో ఎప్పుడూ గొడవలే జరుగుతుండటంతో ఇక ఫ్రెండిష్‌ ఎక్కడ నుంచి వస్తుంది అని బదులిచ్చింది. దీంతో మరి షణ్నూతో కూడా గొడవలు అవుతుంటాయి కదా అంటూ అరియానా కౌంటర్‌ వేసింది.

ఇక రవిని నామినేట్‌ చేసి అతను ఎలిమినేట్‌ అయ్యాక మాత్రం రవి కోసం గేమ్‌ ఆడుతున్నాం అని చెప్పడం ఏంటి అని అడగ్గా.. కొంచెం సందేహంలో పడిపోయిన సిరి రవి ఎలిమినేషన్‌ను ఊహించలేదని ఆన్సర్‌ ఇచ్చింది. చివరగా ఒకనొక సందర్భంలో చోటు లేదా షణ్నూ ఇద్దరిలో ఒకరినే సెలక్ట్‌ చేసుకోవాలి అంటే ఎవరిని ఎంచుకుం‍టావ్‌ అంటూ అరియానా ప్రశ్నించింది. దీంతో ఒకింత అయోమయంలో పడిపోయిన సిరి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు.. అరియానా అడిగిన ప్రశ్నలకు సిరికి బొమ్మ కనపడుతుందంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్టార్‌ మా రిలీజ్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement