
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు చేసుకునే పనిలో పడ్డారు హౌస్‌మేట్స్. కొత్త ప్రదేశం కాబట్టి తొలిరోజే కొందరికి నిద్ర పట్టడం కూడా కష్టమే. అలాంటిది రాత్రిపూట ఎవరైనా గురక పెడితే ఇంకేమైనా ఉందా? బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైంది. యాంకర్ లోబో అర్ధరాత్రి ఆదమరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతడి గురక సౌండ్‌కు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు హౌస్‌మేట్స్.
యాంకర్ రవి అయితే అతడికి దుప్పటి కప్పి, బయటకు పెద్దగా సౌండ్ వినిపించకుండా రెండు దిండ్లను కూడా లోబో ముఖం మీద పెట్టి ఉంచాడు. అయినా సరే లోబో గురకను ఆపడం ఎవరి తరమూ కాలేదు. దీంతో రాత్రంతా వారికి జాగారమే అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు సిరి హన్మంత్, జెస్సీ ఏదో దొంగతనం ప్లాన్ చేసినట్లున్నారు. వీరిద్దరూ కలిసి ఒకరి చెప్పులు, మరొకరి ఇయర్ రింగ్స్‌ను దాచేసినట్లు తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చోరీకి పాల్పడిన ఈ దొంగలను ఇతర కంటెస్టెంట్లు పట్టుకోగలరా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment