
బిగ్‌బాస్ హౌస్‌లో ఏకాభిప్రాయం అన్నది అంత ఈజీ కాదు. అందులోనూ బెస్ట్, వరస్ట్ పర్ఫామర్స్‌ను ఎంచుకోమన్నప్పుడు కంటెస్టెంట్లు ఎవరికి వారు తామే బెస్ట్ ఇచ్చామని చెప్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమకంటే ఎక్కువగా కష్టపడినట్లు అనిపించినప్పుడు మాత్రమే ఇతరుల పేర్లను చెప్తుంటారు. ఇక వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నప్పుడు కూడా కొందరు వ్యక్తిగత విబేధాలను మనసులో పెట్టుకుని, మరికొందరు ఆటను దృష్టిలో ఉంచుకుని ఆయా పేర్లను సూచిస్తుంటారు.
తాజాగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎంచుకోమని ఆదేశించాడు. దీంతో మానస్.. తననే వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు. అలా కుదరదని కెప్టెన్ జెస్సీ చెప్పడంతో మానస్ కెప్టెన్‌నే నామినేట్ చేశాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ ఎవరి మీదో బాగా ఫైర్ అవుతున్నాడు. ఎలా ఆడాలో కూడా తెలీదంటూ చిరాకు పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈవారం చెత్త ఆటగాడిగా ఇంటిసభ్యులు మానస్‌ను ఎన్నుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీని ప్రకారం జెస్సీ, సన్నీల తర్వాత మానస్ జైలులో బందీ అవనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment