
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ప్రస్తుతం 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో నుంచి ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపేందుకు మండే ఎపిసోడ్‌లో నామినేషన్స్ జరగనున్నాయి. ఇంకేముందీ.. నామినేషన్స్ మొదలవగాఏ కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఫైర్ అవుతూ, దూషించుకోవడం మొదలు పెట్టారు.
ఇక మానస్, శ్రీరామ్‌ల మధ్య రగులుకున్న అగ్ని గుండం ఇప్పుడప్పులే చల్లారేలా కనిపించడం లేదు. దీంతో మరోసారి శ్రీరామ్.. మానస్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో తన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రియ మాటలను మనసులో పెట్టుకున్నాడు సన్నీ. అందుకే మీరు అన్న మాటలను నేను తీసుకోలేకపోతున్నా అంటూ ప్రియను నామినేట్ చేశాడు. అయితే తనేం అందో? చెప్పమని అడగ్గా.. అది మీకు కూడా తెలుసు అని సన్నీ బదులిచ్చాడు. తర్వాత లహరి కూడా ప్రియను నామినేట్ చేసినట్లు కనిపించింది. దీంతో ప్రియ.. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావని అనడంతో ఇది సేఫ్ గేమ్ కాదు, సేఫ్ గేమ్ అనుకుంటే నామినేట్ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు అని కౌంటర్ ఇచ్చింది లహరి.
చదవండి: Bigg Boss Telugu 5: ఉమాదేవి అవుట్, కన్నీళ్లు ఆపుకోలేకపోయిన లోబో
ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, జెస్సీల మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. ఒకరు చెప్తే నువ్వు నన్ను నామినేట్ చేశావని తెలుసు అని నటరాజ్ మాస్టర్ జెస్సీ మీద ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. నువ్వు చిన్నపిల్లోడివి, జుజూ అంటూ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవగా దానికి అతడు కూడా అవును, నేను చిన్నపిల్లోడినే అని తిరిగి కౌంటరిచ్చాడు. స్త్రీలతో వ్యవహరించే విధానం నచ్చలేదంటూ విశ్వ.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు యాంకర్ రవి కూడా జెస్సీ మీద అసహనం వ్యక్తం చేశాడు. ఎన్ని రోజులు చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపించి సింపథీ పొందడానికి ట్రై చేస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందంటూ జెస్సీ పరువు తీశాడు రవి. ఇక లోబో ప్రియాంకను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. మరి వీళ్ల వాగ్వాదాలు, నామినేషన్స్ కొట్లాటలు చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment