
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: నామినేషన్స్ వచ్చాయంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోతుంటాయి. అప్పటిదాకా స్నేహితులుగా ఉన్నవారు కూడా బద్ధ శత్రువుల్లా మారిపోవచ్చు. ఆల్రెడీ శత్రువులైన వారి మధ్య మరింత దూరాన్ని పెంచవచ్చు. మొత్తంగా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టే నామినేషన్ పర్వం నేడు స్టార్ట్ అయింది. దీంతో ఎవరెవర్ని నామినేట్ చేయాలా? అని హౌస్‌మేట్స్ పరిపరివిధాలుగా ఆలోచించారు. మరి నేటి గేమ్‌లో ఎవరు నామినేట్ అయ్యాడు? ఏమేం గొడవలు జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే!
తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే..
గేమ్‌లో గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేయాలి కానీ ఒకరిని తొక్కేద్దాం, కెరీర్‌ను నాశనం చేద్దాం అనుకుంటే అంతకన్నా లేకిడివాళ్లు ఎవరూ ఉండరు అని జెస్సీ యాంకర్ రవి మీద పరోక్షంగా మండిపడ్డాడు. ఇక్కడ హౌస్‌లో విశ్వ, రవి, లోబో, సన్నీ, మానస్ ఒక గ్రూప్ అయ్యారని షణ్నుతో చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే కిచెన్‌లో పనులు పంచుకోండని కెప్టెన్ శ్రీరామ్ సన్నీకి సలహా ఇచ్చాడు. అయితే ఇంతలో సిరి వచ్చి.. కిచెన్‌లో ఆల్‌రెడీ మనం పనులు పంచేసుకున్నాం కదా అని చిర్రుబుర్రులాడింది. అయినా ఇక్కడ కెప్టెన్ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడంటూ తన గ్యాంగ్‌తో కూర్చున్నప్పుడు శ్రీరామ్ మీద జోకులు పేల్చింది.
లోబో వల్లే నాకా శిక్ష, అందుకే నామినేట్: జెస్సీ
తర్వాత ఐదోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా ఇంటిసభ్యులు ఒకరి తర్వాత ఒకరు కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన జెస్సీ... తన మాటలే వినాలి, తను చెప్పినట్లే ఆడాలని రవి మానిప్యులేట్ చేస్తున్నాడంటూ అతడిని నామినేట్ చేశాడు. లోబో వల్లే కెప్టెన్సీ టాస్క్‌లో శిక్ష పడిందని అతడిని నామినేట్ చేశాడు. తర్వాత సన్నీ.. షణ్ముఖ్, సిరితో కనెక్ట్ కాలేకపోయానంటూ వారిద్దరినీ నామినేట్ చేశాడు.
ఆమె ఏది మాట్లాడినా సీరియస్‌గా తీసుకుంటుంది..: పింకీ
విశ్వ.. జెస్సీ చాలాసార్లు నోరు జారాడని, షణ్ముఖ్ రేషన్ మేనేజర్ అయ్యాక అతడి ప్రవర్తన మారిపోయిందంటూ వారిని నామినేట్ చేశాడు. కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన రవి, సన్నీని నామిట్ చేస్తున్నానని తెలిపింది. అనంతరం లోబో.. 'గతవారం ప్రియ మీద అరిచినప్పుడు మానస్, షణ్ముఖ్ సడన్‌గా నా మీద పడి నామినేట్ చేశారు. ఇది కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నా'నని వెల్లడించాడు. ప్రియాంక సింగ్.. సరదాగా మాట్లాడినా హమీదా సీరియస్‌గా తీసుకుంటుందని, లోబో టాస్కుల్లోనూ స్ట్రాంగ్‌గా అవ్వాలని నామినేట్ చేస్తున్నానని తెలిపింది.
షణ్ముఖ్ నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు: రవి
సిరి మాట్లాడుతూ.. పక్కవాళ్ల గేమ్‌లో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్న రవిని, రేషన్ మేనేజర్ అయ్యాక హమీదా ప్రవర్తనలో తేడా వచ్చిందంటూ ఆమెను నామినేట్ చేసింది. రవి.. జెస్సీది ఇమ్మెచ్యూర్ బిహేవియర్డ్ అనిపిస్తుందన్నాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని తన పేరు ట్యాగ్‌చేయడం చాలా నెగెటివిటీగా అనిపించిందని పేర్కొన్నాడు. గతవారం అకారణంగా తనను నామినేట్ చేసిన షణ్ముఖ్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. అతడు వేరేవాళ్ల గురించి తన దగ్గర చెప్తూ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడనిపించిందని అభిప్రాయపడ్డాడు.
విశ్వ సొంతంగా గేమ్ ఆడట్లేదు: షణ్ను
యానీ మాస్టర్.. తనకు టఫ్ కాంపిటీటర్స్ అయిన రవి, విశ్వను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. అనంతరం షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ చూసిన విశ్వ వేరు, ఇప్పుడు చూస్తున్న విశ్వ వేరు.. పక్కవాళ్ల ఇన్‌ఫ్లూయెన్స్ వల్లో, మరింకేదైనా కారణమో తెలీదు కానీ ఇండిపెండెంట్ గేమ్ మర్చిపోయాడనిపిస్తోందని తెలిపాడు. తర్వాత మానస్‌ను నామినేట్ చేశాడు. హమీదా వంతు రాగా.. ప్రియ తనతో సరిగా ఉండదని, షణ్ముఖ్ బెస్ట్ ఫ్రెండనుకున్నా, కానీ అతడు వేరే జోన్‌లో ఉంటున్నాడంటూ వారిద్దరినీ నామినేట్ చేసింది.
జెస్సీ హైపర్ అయిపోతుంటే, షణ్ను వేరే ప్రపంచంలో ఉంటున్నాడు..
శ్వేత.. తనకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని కాజల్, మానస్‌ను నామినేట్ చేసింది. ప్రియ.. ఎవరి గేమ్ వారు ఆడాలని చెప్పే షణ్ముఖ్ అతడిదాకా వచ్చేసరికి మాత్రం పాటించడం లేదంది. ఇక సన్నీ తనను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తోందంటూ అతడిని నామినేషన్‌లోకి పంపింది. మానస్.. జెస్సీ, షణ్ముఖ్‌ను నామినేట్ చేశాడు. కెప్టెన్ శ్రీరామ్.. జెస్సీ హైపర్ అవుతున్నాడని, షణ్ముఖ్ వేరే ప్రపంచంలో ఉండిపోతున్నాడంటూ వాళ్లిద్దరినీ నామినేట్ చేశాడు.
ఆ ఒక్కరు తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌కు వ్యతిరేకమే!
తర్వాత ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారన్న విషయాన్ని బిగ్‌బాస్ పేర్లతో సహా వెల్లడించాడు. అత్యధికంగా షణ్ముఖ్‌ను ఎక్కువమంది నామినేట్ చేశారు. మరీ ముఖ్యంగా జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. మొత్తంగా ఈ ఐదోవారంలో షణ్ముఖ్, రవి, హమీదా, లోబో, మానస్, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
అలా హార్ష్‌గా మాట్లాడకురా.. : షణ్నును అభ్యర్థించిన రవి
ఈ ప్రక్రియ అనంతరం కిచెన్‌లో మరోసారి చిచ్చు చెలరేగింది. మానస్‌ను నామినేట్ చేసినందుకు అతడు ఇంత యాటిట్యూడ్ చూపించాలా అని శ్వేత మండిపడింది. అతడితో మాట్లాడటమే అనవసరం అని ఫీలైంది. మరో పక్క శ్రీరామ్.. షణ్ముఖ్, జెస్సీ, సిరి రెండు రోజుల నుంచి డిఫరెంట్‌గా ఉంటున్నారని అభిప్రాయపడ్డాడు. మరోవైపు షణ్ముఖ్-రవిల మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. నీతో దూరంగా ఉంటున్నంత మాత్రాన నేను సరిగా పర్ఫామ్ చేయనట్లు కాదని ముఖం పట్టకుని మాట్లాడాడు షణ్ను. దీంతో రవి.. అంత హార్ష్‌గా మాట్లాడకురా అని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జెస్సీ ఫుడ్ తనే వండుకుని తినాలి: కెప్టెన్ కొత్త రూల్
ఇక కిచెన్‌లో పనుల పంపకాల్లో బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి వంట వాళ్లు వండుకుని తినేలా రూల్ పెడతానని జెస్సీని హెచ్చరించాడు శ్రీరామ్. జెస్సీ ఫుడ్ జెస్సీనే వండుకుని తినాలని ఆదేశించాడు. దీంతో హర్ట్ అయిన జెస్సీ.. నాకు ఫుడ్ పెట్టరంట, నా ఫుడ్ నేనే వండుకోవాలంట అని చెప్పడంతో సిరి, షణ్ను సీరియస్ అయిపోయారు. 'ఇదేమీ నీ ఇల్లు కాదు, బిగ్‌బాస్ హౌస్' అని కెప్టెన్ మీద విరుచుకుపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలోకి రాకంటూ హెచ్చరించాడు శ్రీరామ్. ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోవాలని చెప్పడానికి నువ్వెవరివి? జస్ట్ కెప్టెన్‌వి అంతే! అని అగ్గి మీద గుగ్గిలమైంది సిరి. నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని రివర్స్ కౌంటరిచ్చాడు శ్రీరామ్.
వాళ్లు తినకపోతే నేనూ తినను: కెప్టెన్
ఇక ఈ గొడవతో చిర్రెత్తిపోయిన యానీ మాస్టర్ సిగ్గు, శరం ఉండాలి అలా గ్రూప్‌ను వేసుకుని రావడానికి అంటూ జెస్సీ మీద ఫైర్ అయినట్లు కనిపించింది. కానీ కొద్ది సేపటికే సిరి, షణ్ను, జెస్సీ తినకుండా కూర్చోవడంతో యానీ వారి దగ్గరకు వెళ్లి తినమని బుజ్జగించింది. ఆకలేస్తే తింటారు, లేకపోతే వదిలేయండి అంటూ కెప్టెన్ శ్రీరామ్ ఓపక్క చిరాకు పడుతూనే వాళ్లు తినకపోతే తాను కూడా తిననని శపథం చేశాడు. వెంటనే జెస్సీ, షణ్ముఖ్‌లకు ప్లేటులో భోజనం పట్టుకెళ్లి తినిపించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment