Bigg Boss 5 Telugu This Week Nominated Contestants: నామినేషన్‌ హీట్‌.. జెస్సీకి అస్వస్థత! - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: నామినేషన్‌ హీట్‌.. జెస్సీకి అస్వస్థత!

Published Tue, Nov 2 2021 12:20 AM | Last Updated on Tue, Nov 2 2021 11:16 AM

Bigg Boss Telugu 5: Shanmukh, Siri Dont Care About Jessie - Sakshi

Bigg Boss 5 Telugu, 9th Week Nominations: జెస్సీ పొద్దుటినుంచి వాంతింగ్‌ చేసుకుంటుంటే పక్కనే ఉండి కాసేపు అతడికి అండగా నిలబడ్డాడు. జెస్సీ ఆరోగ్యం బాగోలేకపోతే షణ్నూ, సిరి ఏమాత్రం పట్టించుకోవట్లేదేంటని సన్నీ మానస్‌తో వాపోయాడు. కానీ మానస్‌ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సలహా ఇచ్చాడు. మరోవైపు జెస్సీ లోపలికి వెళ్లి బెడ్‌పై కూర్చుని అవస్థ పడుతున్నాడు. అతడి పక్కనే ఉన్న షణ్ను చూసి వదిలేశాడే కానీ, కనీసం ఏమైందని కూడా ఆరా తీయకపోవడం గమనార్హం. సీక్రెట్‌ టాస్క్‌ ఫెయిలయినప్పటి నుంచి జెస్సీని వాళ్లు దూరం పెడుతున్నారని మానస్‌ అభిప్రాయపడ్డాడు. అనంతరం 9వ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యులకు ఫోమ్‌ పూసి తగు కారణాలు చెప్పి నామినేట్‌ చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. 

ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరాఖ్‌ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్‌ చేశాడు మానస్‌. నువ్వు ఉన్నా ఫరాఖ్‌ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్‌. తర్వాత సంచాలకుడిగా సరైన నిర్ణయం తీసుకోలేదని జెస్సీని నామినేట్‌ చేశాడు. కాలేజీ బ్యాచ్‌లాంటి గొడవలొద్దంటూ శ్రీరామ్‌.. సన్నీ, మానస్‌ను నామినేట్‌ చేశాడు.  'అన్నీ గుడ్‌ క్వాలిటీస్‌, ఫెంటాస్టిక్‌ పర్సన్‌.. కానీ ధైర్యం కోల్పోతున్నావ్‌' అంటూ రవి.. మానస్‌ను, తర్వాత కాజల్‌ను నామినేట్‌ చేశాడు. పింకీ.. స్ట్రాంగ్‌ అంటూ విశ్వను, రవి ఆలోచనలను అందుకోలేకపోతున్నానని అతడిని నామినేట్‌ చేసింది. సిరి.. సన్నీ, యానీని; జెస్సీ.. సన్నీ, మానస్‌ను; సన్నీ.. జెస్సీ, సిరిని నామినేట్‌ చేశారు.

స్ట్రాంగ్‌గా ఉండేవాళ్లు వెళ్లిపోవాలంటే వీక్‌గా ఉండేవాళ్లు కూడా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ విశ్వ ప్రియాంకను, తర్వాత మానస్‌ను నామినేట్‌ చేశాడు. ఇక కాజల్- రవి మధ్య మరోసారి ఫైట్‌ జరిగింది. ఆమె రవితోపాటు శ్రీరామ్‌ను నామినేట్‌ చేసింది. యానీ.. సిరి, కాజల్‌ను నామినేట్‌ చేసింది. షణ్ను.. మానస్‌తో పాటు ప్రియాంకను నామినేట్‌ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ప్రియాంక నీ గేమ్‌ నువ్వే ఆడు, అందరిలో నువ్వే స్ట్రాంగ్‌ అనిపిస్తావు' అని సలహా ఇచ్చాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. 'నామినేట్‌ చేసి వెళ్లిపోయాక ఇంకెవరు ఆడతారు?' అని చిర్రుబుర్రులాడింది. అయినా నేను ఏ గేమ్‌ సరిగా ఆడటం లేదో చెప్పాలి కదా! అని ఆవేశపడింది. షణ్ను ఫోమ్‌ పూయబోతే పింకీ ఆ ప్లేట్‌ను తన ముఖాన గట్టిగా కొట్టుకుంది.

నామినేషన్‌ పూర్తయ్యాక సిరి మరోసారి సన్నీని ఎందుకు నామినేట్‌ చేశానో అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. కానీ ఇది వారిద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. హైలైట్‌ అవ్వాలనే ఇలా చేసింది అని సన్నీ మానస్‌ గుసగుసలు పెట్టడంతో వినేసిన సిరి... నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ పడరిక్కడ అని గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఇక ఈ వారం మానస్‌, సన్నీ, శ్రీరామ్‌, సిరి, కాజల్‌, ప్రియాంక, రవి, జెస్సీ, యానీ, విశ్వ నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌.

చదవండి:  బిగ్‌బాస్‌లో లోబో మిత్రువులు, శత్రువులు ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement