
Bigg Boss Telugu 5 First Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదటి వారంలో యాంకర్ రవి, మోడల్ జెస్సీ, నటి హమీదా, యూట్యూబ్ స్టార్ సరయూ, నటుడు మానస్, ఆర్జే కాజల్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ రవి ఎక్కువ ఓట్లతో మొట్టమొదటగా సేవ్ అవుతాడన్న విషయం తెలిసిందే! ఆ తర్వాత ఆర్జే కాజల్, నటుడు మానస్ సేఫ్ జోన్‌లో ఉన్నట్లు అనఫీషియల్ పోల్స్‌లో వెల్లడుతోంది. హమీదా, సరయూ, జెస్సీ డేంజర్ చివరి మూడుస్థానాల్లో తచ్చాడుతున్నారు.
అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా పవర్ యాక్సెస్ పొంది ప్రేక్షకులకు తన పవరేంటో చూపించింది. మొదట్లో తన ఏడుపుతో ఈ సీజన్‌కు పాతాళగంగలా మారుతుందేమో అనిపించినప్పటికీ తర్వాత మాత్రం గేమ్‌లో తన సత్తా చూపించి జనాలను ఆకట్టుకుంది. ఇక జెస్సీ.. ఎప్పుడేం చేయాలి? ఎప్పుడేం మాట్లాడాలో అర్థం కాని కన్‌ఫ్యూజన్‌లోనే వారం నెట్టుకొచ్చేశాడు. ఒకరిద్దరితో జరిగిన గొడవలు అతడికి మైనస్‌గా మారాయి.
ఇక సరయూ.. ఆమెకు ఒకరు ఎదురొచ్చినా, ఆమె ఇంకొకరికి ఎదురెళ్లినా వారికే రిస్కు. ఆమెకు ఏదైనా తప్పనిపిస్తే అక్కడే కుండ బద్ధలు కొట్టి చెప్పేస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే కూడా అస్సలు సహించదు. అలాంటి తను కాజల్‌తో గొడవకు దిగింది. కెప్టెన్సీ టాస్కులో కాజల్ వైఖరిపై మండిపడింది. ఈ గొడవ మినహాయిస్తే సరయూను స్క్రీన్‌పై పెద్దగా చూపించింది కూడా లేదు. ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేట్ అయింది ఈ కంటెస్టెంటే అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో లీకైంది. 7 ఆర్ట్స్ సరయూ బిగ్‌బాస్‌ను వీడబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త చాలామందిని షాక్‌కు గురి చేస్తోంది.
జెస్సీ ఈ వారం గండం గట్టెక్కడం కష్టమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్న తరుణంలో అతడికి బదులు సరయూను ఎలిమినేట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరోపక్క ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, జెస్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు కొందరు లీకువీరులు. మరి డేంజర్‌జోన్‌లో ఉన్న సరయూ, జెస్సీలలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment