![Bigg Boss Telugu Show: Jaswanth Visits Kachiguda Hospital In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/17/jaswanth-padala.jpg.webp?itok=sgvdKRZh)
సాక్షి, కాచిగూడ(సికింద్రాబాద్): అనారోగ్యం కారణంగా ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ జశ్వంత్ కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. విజయవాడకు చెందిన జశ్వంత్ మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్ 8వ కంటెస్టెంట్‌గా చోటు సంపాదించాడు.
బిగ్‌బాస్ షోలో గేమ్ ఆడుతుండగా మరో కంటెస్టెంట్ చేయి జశ్వంత్ మెడపై బలంగా తగిలి నొప్పి ఎక్కువ కావడంతో షో నుంచి వైదొలిగాడు. జశ్వంత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నుంచి వైదొలగడం బాధగా ఉందని, ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment