
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయి. చాలామంది కంటెస్టెంట్లు ఇక్కడ బంధాల ఎమోషన్స్‌లో చిక్కుకోవద్దని ముందుగానే బలంగా నిర్ణయించుకుని వచ్చారు. ఎవరు ఎదురు మాట్లాడినా ఇచ్చిపడేయాలని ఫిక్సయ్యారు. అందుకే చిన్నపాటి విషయాలను కూడా రచ్చకీడుస్తూ కొట్లాటకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన విషయం తెలిసిందే! మొత్తానికి ఈ వారం రవి, సరయూ, కాజల్, మానస్, హమీదా జెస్సీ ఎలిమినేషన్ గండంలో ఉన్నారు.
ఇదిలా వుంటే నేటి ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో జెస్సీ మరోసారి తగాదా పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకుని కూర్చోగా అక్కడికి వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీసేయమంటే అందుకతను ఒప్పుకోనట్లున్నాడు. దీంతో శివాలెత్తిన యానీ మాస్టర్ నీది నీ దగ్గర పెట్టుకో, నాటకాలు చేయకు అని తిట్టిపోసింది. నీ వాయిస్ లేస్తే నా గొంతు లేవదా? అని నిందిస్తుండగా జెస్సీ దానికి రియాక్షన్‌గా చప్పట్లు కొట్టాడు. అయితే అక్కడికి సిరి వస్తే మాత్రం కుర్చీపై నుంచి కాలు చటుక్కున తీసేయడం గమనార్హం.
నామినేషన్ ప్రక్రియలో యానీ మాస్టర్ అంటే రెస్పెక్ట్ అని, అందుకే నామినేట్ చేయడం లేదన్న జెస్సీ ఇప్పుడు మాత్రం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. జెస్సీ అమాయకుడనుకుంటే ఇంత వైల్డ్‌గా ఉన్నాడేంటి? జెస్సీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రోమో అర్జున్‌రెడ్డి రేంజ్‌లో ఉన్నా ఎపిసోడ్ గీతా గోవిందంలా సాగుతుందంటూ సెటైర్ వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment