
అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. తనను ఫోకస్ చేయడం ఆపేయాలని యాంకర్ రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జెస్సీ.
Bigg Boss Telugu 5 Promo: సింగర్ శ్రీరామ్, హమీదా మధ్య లవ్ ట్రాక్‌ను మరోసారి గుర్తు చేశాడు కింగ్ నాగార్జున. హమీదా కోసం గిటార్‌తో ఓ మ్యూజిక్ ప్లే చేయడం, హమీదా తనకు లవ్ ఫీలింగ్ వస్తుందనడం నిన్నటి ఎపిసోడ్‌లో చూశాం కదా! దీంతో నాగ్ కూడా గిటార్ అందుకుని సేమ్ మ్యూజిక్ ప్లే చేశాడు. పాట ఎలా ఉందని నాగ్ అడగ్గా.. లవ్ ఫీల్ వస్తుందని తెగ సిగ్గుపడిపోయింది హమీదా.
గతవారం నటరాజ్‌ను గుంటనక్క ఎవరని అడిగిన నాగ్.. ఈసారి మాత్రం ఆ నత్త ఎవరు? అని ప్రశ్నించాడు. దీంతో నటరాజ్ తెలిసిపోయిందా అని పడీపడీ నవ్వాడు. అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. తనను ఫోకస్ చేయడం ఆపేయాలని యాంకర్ రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జెస్సీ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని అందరిముందే హెచ్చరించడంతో రవి గుడ్లు తేలేశాడు. జెస్సీ వ్యాఖ్యలపై రవి ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!