
Bigg Boss Telugu 5 Promo: సండేను ఫండేగా మార్చేందుకు సరికొత్త గేమ్స్‌తో ముందుకు వచ్చాడు నాగ్. ఈ క్రమంలో కొన్ని సినిమా పాత్రలను కంటెస్టెంట్లు ఒకరికొకరు అంకితమిచ్చుకోవాలని ఆదేశించాడు. ఈ క్రమంలో మహానటి పోస్టర్ చూడగానే సన్నీ తడుముకోకుండా ప్రియాంక పేరు చెప్పాడు. సావిత్రితో పోలుస్తున్నందుకు పింకీ ఉప్పొంగిపోగా... నిన్ను సావిత్రితో పోల్చలేదమ్మా.. బాగా నటించే వ్యక్తివని అర్థం అంటూ ఆమె గాలి తీసేశాడు. ఇంకొకరిని కంట్రోల్‌లో పెట్టే డా.వశీకరన్ పాత్ర షణ్నుకు బాగా సెట్టవుతుందని చెప్పింది సిరి. అంటే అతడు తనని కంట్రోల్‌లో పెడతాడని చెప్తూ వాపోయింది.
సన్నీ అర్జున్‌రెడ్డి అని, శ్రీరామ్ రేలంగి మావయ్య అని, మానస్ అపరిచితుడు అని పేర్కొన్నారు. ఇంట్లో ఎవరు సింపతీ కోసం ప్రయత్నిస్తారని నాగ్ ప్రశ్నించగా మానస్ కాజల్ పేరు చెప్పాడు. నా వాళ్లే నన్నిలా అంటే ఎలారా? అని కాజల్ చెప్పాల్సిన డైలాగ్‌ను నాగ్ ఇమిటేట్ చేయడంతో అంతా ఘొల్లుమని నవ్వారు.
Comments
Please login to add a commentAdd a comment