బిగ్‌బాస్‌లోకి దీప్తి సునయన.. సంతోషంలో షణ్నూ | Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Entry In Saturday Episode | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: దీప్తి ఎంట్రీతో షణ్నూ ఆటతీరు మారుతుందా?

Nov 27 2021 7:42 PM | Updated on Nov 28 2021 4:25 PM

Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Entry In Saturday Episode - Sakshi

Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Entry In Saturday Episode: బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌ మరింత స్పెషల్‌గా ముస్తాబైంది. ఇప్పటికే ఫ్యామిలీ టైం అంటూ కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌కు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆహ్వానించారు. ఇక ఈ ఎపిసోడ్‌లో దీప్తి సునయన ఎంట్రీ హైలెట్‌గా నిలిచింది. తొలుత షణ్నూ కోసం అతని అన్నయ్య మాత్రమే వచ్చారని నాగార్జున చెప్పగా షణ్ముక్‌ కాస్త నిరాశ చెందాడు.

అయితే ఆలోపే దీప్తి సునయన ఎంట్రీ ఇచ్చి అతని మూడ్‌ను మార్చేసింది. దీప్తిని చూడగానే 1000 వాలా బల్బులా షణ్నూ ముఖం వెలిగిపోయింది. 'సచ్చినోడా..నిన్ను చాలా మిస్సయ్యాను' అంటూ దీప్తి చెప్పగా..షణ్నూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా రిలీజ్‌ చేసింది. కాగా దీప్తి సునయన ఎంట్రీతో షణ్నూ ఆట ఇకనైనా కాస్తా మారుతుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిరి-షణ్నూల రిలేషన్‌ గురించి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని కాస్త డిస్టెన్స్‌ మెయింటేన్‌ చేస్తారేమో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement