
తనకు వర్టిగో ఉందన్న విషయాన్ని అతడే స్వయంగా హౌస్‌లో పలుమార్లు వెల్లడించాడు. రోజులు వారాలవుతున్నా అతడి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు...
Bigg Boss 5 Telugu Contestant Jessie Suffering From Vertigo: కొద్ది రోజులుగా జెస్సీ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే! టాస్కుల్లో పాల్గొనడం అటుంచితే గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, కుదురుగా నడవలేకపోతున్నాడు. తనకు వర్టిగో ఉందన్న విషయాన్ని అతడే స్వయంగా హౌస్‌లో పలుమార్లు వెల్లడించాడు. రోజులు వారాలవుతున్నా అతడి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు. పైగా రోజురోజుకీ అతడిని ఆ వ్యాధి ఇబ్బందిపెడుతూనే ఉంది. దీంతో బిగ్‌బాస్ అతడిని హౌస్ నుంచి పంపించేస్తున్నాడు. అతడికి సీక్రెట్ రూమ్‌లో చికిత్స అందిస్తారా? లేదంటే అటునుంచటే ఇంటికి పంపించేస్తారా? అన్నది శనివారం నాగార్జున క్లారిటీ ఇస్తాడు. ఇంతకీ ఈ వర్టిగో అంటే ఏమిటి? దానివల్ల తలెత్తే సమస్యలేంటి? అనేవి తెలుసుకుందాం..
► తల తిరగడాన్ని వైద్యపరిభాషలో డిజీనెస్, గిడీనెస్, వర్టిగో అని పిలుస్తున్నారు.
► ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది.
► వర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది!
► కళ్లు తిరగడం, బ్యాలెన్స్ అదుపు తప్పడం
► గాల్లో తేలినట్లుగా అనిపించడం
► చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించడం
► వర్టిగో రెండు రకాలు: సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో
► తరచూ తల తిరగడం, విపరీతంగా వాంతులు కావడం, సరిగా నడవలేకపోవడం సెంట్రల్ వర్టిగో లక్షణం. సెంట్రల్ వర్టిగో లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి
► ఒక వైపుకు తిరిగినప్పుడో, ఒక వైపుకు పడుకున్నప్పుడో తల తిరుగుతూ ఉంటుంది. దీన్ని పెరిఫరల్ వర్టిగో అంటారు. చెవిలో ఒక్కోసారి హోరుమని శబ్ధం రావడం, ఒక్కోసారి సడన్‌గా వినికిడి శక్తి మందగించడం వంటి లక్షణాలు కూడా దీనికిందకే వస్తాయి.
► డాక్టర్ ఇచ్చిన ఔషధాలను తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయడం వల్ల వర్టిగోను అదుపులో ఉంచవచ్చు.