vertigo
-
Dr. Lasya Sai Sindhu: సమస్యను గుర్తించడమే అసలైన మందు
ఎవరికీ చెప్పుకోలేని వేదన, భావోద్వేగాల ఒత్తిడి శరీరం మీద పడుతుంది. చాలావరకు ఆరోగ్య సమస్యలు మందులతో నయం కావచ్చు. కానీ, కొన్నింటికీ ఎంతకీ పరిష్కారం దొరకకపోతే, అందుకు మూల కారణమేంటో తెలుసుకోవడానికి తగిన శోధన అవసరం. వర్టిగో (కళ్లు తిరగడం) సమస్యకు మూల కారణమేంటో తెలుసుకుంటూ చికిత్స చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ‘నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా లాస్య సాయి సింధును సాక్షి పలకరించింది. నలభైఏళ్లకు పైబడిన ఒక మహిళ... ‘మంచం మీద పడుకుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అనే సమస్యతో వచ్చింది. రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోవడం అలవాటు చేసుకుంది. పూర్తి చికిత్స తర్వాత ఇప్పుడు మామూలుగా మం^è ం మీద నిద్రపోగలుగుతోంది. 90 శాతం మహిళలు భావోద్వేగాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పదిహేనేళ్ల అబ్బాయి స్కూల్లో బెంచిమీద కూర్చున్న కాసేపటికి కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతూ సరిగా చదవలేకపోతున్నాడు. చికిత్సలో అతనికి చదువుకు సంబంధించిన సమస్యనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా కారణమని తెలిసింది. పనిలో చురుకుగా ఉండే యాభైఏళ్ల వ్యక్తి రెండు నెలలుగా కళ్లు తిరుగుతున్నాయన్న సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వచ్చారు. కరోనా తర్వాత వైరల్ అటాక్ అతని మెదడు పనితీరులో సమస్యకు కారణం అయ్యిందని తేలింది. ఇలాంటివెన్నో ప్రతిరోజూ చూస్తుంటాం. నేను ఈఎన్టీ సర్జన్‌ని. వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్‌లో పరిశోధన చేశాను. ఈఎన్టీలోనే మరింత ఉన్నతమైన విద్యార్హత ఈ న్యూరటాలజిస్ట్. 200 మంది వర్టిగో పేషెంట్స్‌పై పరిశోధన చేసినప్పుడు నాకు ఈ విభాగంలో ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లుగా న్యూరటాలజిస్ట్గా వైద్య రంగంలో సేవలందిస్తున్నాను. చేస్తున్న కృషికి గుర్తింపుతోపాటు గతంలోనూ రెండు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాను. వచ్చిన రివ్యూస్... ఈ సమస్యలో ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకని, 5–10 నిమిషాల్లో పేషెంట్ పూర్తి సమస్య అర్థం కాదు. ఈ గంట సమయంలో చేసిన చికిత్సకు రోగిలో సరైన మార్పులు రావడం, వారు ఇచ్చే రివ్యూస్.. మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అన్ని వర్గాల్లోనూ... ఇటీవల చూస్తున్న కేసుల్లో మగవారిలోనూ సమస్య ఎక్కువ గమనిస్తున్నాం. నిజానికి ఆడవాళ్లలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ, మగవారు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. భావోద్వేగాలను బయటకు వెలిబుచ్చరు. ఈ సమస్య వర్టిగోకు దారితీస్తుంది. మరో ఆందోళనకర సమస్య ఏంటంటే.. టీనేజ్ పిల్లల్లో వర్టిగో కనిపిస్తోంది. మానసికంగా వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో చదువుకు సంబంధించినవి, కుటుంబ సమస్యలు... కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ముందు పేషెంట్‌కు సంబంధించిన అన్నిరకాల టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించి చూస్తాం, వారు చెప్పిన ఆరోగ్య సమస్యమీద వర్క్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వర్టిగో సమస్యలు పెరిగాయి కాబట్టి ఫిజికల్ హెల్త్ ఆ తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చూస్తున్నాం. కుటుంబం కూడా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకొని, పేషెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి. ఆన్లైన్ అవగాహన కాన్ఫరెన్స్, సోషల్‌మీడియా ద్వారా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునేవారున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎమ్మెస్ చేసేవాళ్లు ఉంటున్నారు. జీవితంలో ఎవరికి తగ్గ సమస్య వారికి ఉంటుంది. దానినుంచి బయటకు రావడమే ముఖ్యం. అందుకోసం చేసే ప్రయత్నం ప్రతిరోజూ ఉంటుంది. డాక్టర్‌గా రోజు చివరలో నా నుంచి చికిత్స తీసుకున్నవాళ్లు ‘మా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది’ అనుకుంటే చాలు. అదే పెద్ద అవార్డ్’’ అంటారు ఈ డాక్టర్. కోవిడ్ తర్వాత... ‘కళ్లు తిరుగుతున్నాయి..’ అనే సమస్యతో వచ్చే వారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. గతంలో ఒత్తిడి, భావోద్వేగాలలో మార్పు కారణం అనుకునేవాళ్లం. ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం అని తెలిసింది. వర్టిగో సమస్యకు టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్లు. టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుది. ఆ తర్వాత మళ్లీ మామూలే! దీనికి టాబ్లెట్స్తోపాటు కౌన్సెలింగ్, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా అవసరం అని గమనించాను. ఒక పేషెంట్‌కి ఇచ్చే చికిత్స 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. వారంలో మూడుసార్లు ఈ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ లాస్య సాయి సింధు – నిర్మలారెడ్డి -
అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!
అతిగా ఫోన్ వాడకం ఓ మహిళను వీల్‌చైర్‌కు పరిమితం చేసింది. యూకేకి చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా ఫాక్స్ వర్టిగో అనే వ్యాధి బారినపడింది. తాను సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ 14 గంటల పాటు నిరంతరంగా ఫోన్ వాడానని ది మిర్రర్ వార్తా సంస్థకు ఆమె వివరించింది. ఐప్యాడ్, ఐఫోన్లలో గంటలకొద్దీ గడపడం తనకు భారీ చేటును కలిగించిందని, వెర్టిగో వ్యాధితో మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫాక్స్ పోర్చుగల్‌లో ఉన్నప్పుడు తలనొప్పి, మైకం వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి. 2021 నవంబర్ నాటికి అవి తీవ్రమయ్యాయి. ‘నేను నిజంగా సరిగ్గా నడవలేనట్లు అనిపించింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అప్పటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కానీ ఎక్కువగా వివరించలేను. ఈ అనర్థాలకు కారణం నా ఫోన్ అని అప్పుడు నాకు తెలియదు. ఇది కోవిడ్ లాంటిదే. నేను వంట చేయలేకపోయాను. ఇంటికి చేరుకోవడానికి వీల్‌చైర్ కావాల్సివచ్చింది. నా తల్లిదండ్రులు నన్ను చూసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు ఆ పరిస్థితి అనుభవించాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. (ఇదీ చదవండి: Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) ప్రస్తుతం ఫెనెల్లా ఆరోగ్యం మెరుగుపడిందని, ఇకపై వీల్‌చైర్ అవసరం ఉండదని ఆమె ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే తన ఫోన్‌ను ముందులాగే గంటలకొద్దీ ఉపయోగిస్తే మళ్లీ ఆ ఘోర పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు. -
ఆరేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా తాను వెర్టిగో (తీవ్రమైన తలనొప్పి) సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సందర్భాల్లో ఈ సమస్య తనను ఎంతగా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ‘ఆరేళ్లుగా నేను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. నా కొత్త మూవీ (ఆన్ యాక్షన్ హీరో) లో ఎత్తైన భవనం నుంచి దూకే సీన్ ఉంటుంది. రక్షణ కోసం హార్నెస్ కేబుల్స్ ఉన్నప్పటికీ ఏదో జరుగుతుందని అమాంతం భయపడిపోయాను. ఆ బాధ నరాలు తెగిపోయేలా చేసింది’ అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆన్ యాక్షన్ హీరో అనే సినిమాలో నటిస్తున్నాడు ఆయుష్మాన్. అనిరుధ్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు డ్రీమ్‌గర్ల్2 సినిమాలో కూడా నటించబోతున్నాడు. ‘వెర్టిగో’ లక్షణాలు ► వెర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది ► తల తిరగడం ► పరిసరాలు తిరుగుతున్న ఫీలింగ్, బ్యాలెన్స్ కోల్పోవడం ► వికారం, వాంతులు ► చెమట ఎక్కువ పడుతుంది -
Vertigo: సుబ్బారావుకు గుండెదడ తగ్గలేదు.. అసలేమిటీ వర్టిగో!
What Is Vertigo: Symptoms Causes Diagnosis Types Treatment: చాలా సేపటినుంచి కదలకుండా సీటులో కూర్చుని సీరియస్‌గా పని చేసుకుంటున్న సుబ్బారావుకు తల దిమ్ముగా అనిపించింది. తల విదిలించాడు. కాఫీ తాగొస్తే బాగుంటుందనుకున్నాడు. సీటులో నుంచి లేచి నెమ్మదిగా రెండడుగులు వేశాడు. కళ్లు బైర్లు కమ్మినట్టు అనిపించింది. విపరీతంగా తల తిరుగుతోంది. ముందుకు తూలి పడబోయాడు. పక్క సీటులోనే ఉన్న రాజుకు సుబ్బారావుకు ఏమి జరుగుతోందో తెలియదు కానీ, అతడు పడబోవడం చూసి గభాల్న పట్టుకున్నాడు. సుబ్బారావుకు గుండెదడ తగ్గలేదు. ‘ఏమైంది, ఎందుకు పడబోయావ్?’ అని అడుగుతున్న రాజు మాటలకు సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఏమయిందోనని కంగారుతో అటూ ఇటూ కుదుపుతూ ‘సుుబ్బారావ్... సుబ్బారావ్’ అని అరిచాడు. ఈ హడావుడికి సెక్షన్‌లోని వారంతా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. ఎవరికి తోచిన సలహా వారు ఇవ్వసాగారు. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య తల తిరగడం. సహజంగా కొంత మందికి తల తిరిగి, వాంతి వచ్చినట్లుగా ఉందని అంటుంటారు. దీన్నే వైద్య పరిభాషలో ‘వర్టిగో’ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేక భయపడుతుంటారు. చూడటానికి ఇది చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ అనుభవించేవారి బాధ అంతా ఇంతా కాదు. వర్టిగోకి అనేక కారణాలుంటాయి. అవేమిటో తెలుసుకుంటే చికిత్స చాలా సులువు అవుతుంది. కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం సాధారణంగా ప్రతీ మనిషికీ ఎప్పుడో ఒకసారి ఎదురవుతాయి ఇవి సాధారణమే అయినా ఏ వ్యాధి లేకుండానే ఇలాంటివి ఎదురైతే ఒక్కోసారి కొన్ని రకాల వ్యాధులు రావడానికిది ముందస్తు సూచనగా భావించవలసి ఉంటుంది. కనుక ఎప్పుడైనా కళ్లు తిరిగినా, ఒళ్లు తూలినా దానికి కారణాలను తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలి. కారణాలు ►వ్యాధుల వలన కలిగే తల తిరుగుడు, తలకు పెద్ద గాయం అవడం ►లోపలి చెవిలో సమతుల్య నియంత్రణ కలిగించే అవయవ లోపం, లోపలి చెవి శస్త్రచికిత్స అనంతరం ►యూస్టాషియన్ గొట్టం మూసుకుపోవడం ►మెడ ఎముకలు అరుగుదల లాంటివి ఏర్పడినపుడు తల తిరుగుడు ... కళ్లు తిరగడం కనిపిస్తుంది. ►కంటి చూపులో పవర్లో మార్పులు ►రక్తపోటు అస్తవ్యస్తం (అధిక రక్త పోటు/బి.పి. తగ్గుట) ►తీవ్రమైన రక్తహీనత ►మెదడులో కంతులు ►తీవ్ర మానసిక వత్తిడులు ►పక్క నుండి హఠాత్తుగా లేచినా, తలను ఒక వైపు నుండి పక్కకు తిప్పినా తల తిరుగుడు వస్తుంది. (పొజిషనల్ వర్టిగో) వ్యాధి నిర్ధారణ పరీక్షలు ►చెవి పరీక్ష ►ఆడియాలజీ పరీక్షలు ►వెస్టిబ్యులర్స్ పరీక్షలు ►రక్త పరీక్షలు ►మధుమేహం ►కొవ్వు (కొలస్ట్రాల్) పరీక్షలు ►హెచ్.ఐ.వి. పరీక్షలు ►మెడ ఎక్స్‌రే ►ఈసిజి ఇతర సంబంధిత రోగ లక్షణాలను నిశితంగా పరీక్షించాలి. ►రోగానికి గల కారణం నిర్ధారణ చేసి దానికి తగిన చికిత్స చేయాలి. మొట్టమొదట రోగికి ధైర్యం చెప్పాలి. కారణం తెలుసుకున్నాక కొన్ని యాంటీ వర్టిగో మందులతో, వ్యాయామాలతో వ్యాధిని తగ్గించవచ్చు. ►అయితే మెదడులో కంతుల వంటి వ్యాధులకు మాత్రం శస్త్ర చికిత్స అవసరమౌతుంది. చదవండి: కరోనా రీ–ఇన్ఫెక్షన్ గనుక వస్తే..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే! గుండె సంబంధమైనవి అధిక రక్తపోటు వల్ల మెదడులోని రక్తనాళాలపై పీడన ఏర్పడినప్పుడు, రక్తనాళాల్లో కొవ్వు పదార్థం చేరడం వల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ పరిమాణం తగ్గి తల తిరగడం జరుగుతుంది. చికిత్స: మూలకారణమైన అధిక రక్తపోటును తగ్గించే మందులు వాడాలి. కొవ్వు పదార్థాలు తగ్గించే స్టాటిన్స్ వాడటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. చెవి, ముక్కు, గొంతు చెవి అంతర్భాగంలోని శబ్ద ప్రసరణ వ్యవస్థలోనూ, రక్త సరఫరాలోనూ, చెవిలోని చిన్న ఎముకల్లో ఏర్పడే తేడాల వల్ల చెవిలో మీనియర్స్ వ్యాధి, వర్టిగో ఏర్పడి దాని ద్వారా మనిషి ఒక పక్కకు తిరిగినప్పుడు ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది. చికిత్స: ఇఎన్‌టి వైద్యనిపుణులను సంప్రదించి ‘స్టిరాయిడ్’ వైద్యం, సినర్జిన్ వంటి మందులు వాడాలి. ఆర్థోపెడిక్: మెడలోని ఎముకలు, మెడ నుండి వచ్చే వివిధ నరాలు చేతుల్లోకి వస్తాయి. అలాగే మెదడుకు గుండె నుండి ప్రసరించే రక్తం మెడ ముందు భాగంలోని రెండు కెరోటాడ్ రక్తనాళాలు, మెడలోని ఎముకల మధ్య గల రంధ్రాల ద్వారా రెండు సర్వైకల్ వెర్టిబ్రల్ రక్త నాళాల ద్వారా ముఖ్యంగా మెదడు వెనక భాగానికి రక్తాన్నందిస్తాయి. మెడలోని ఎముకల అరుగుదలలో ఈ రక్త నాళాలు ఒక్కోసారి ఒత్తిడికి లోనై మెదడుకు సరఫరా అయ్యే రక్తం తగ్గినప్పుడు, నిద్ర నుండి లేవగానే తల తిరిగి పడిపోతుంటారు. చికిత్స: దీనికి కాలర్, ట్రాక్షన్ వైద్యం అవసరం. ద్విచక్ర వాహన ప్రయాణాలు తగ్గించాలి. అన్నిటికీ మించి తనకేదో ప్రమాదకరమైన జబ్బు వచ్చిందేమోననే అపోహను వీడాలి. చదవండి: Health Tips: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా.. -
జెస్సీని తిప్పలు పెడుతున్న వర్టిగో వ్యాధి ఎలాంటిదంటే?
Bigg Boss 5 Telugu Contestant Jessie Suffering From Vertigo: కొద్ది రోజులుగా జెస్సీ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే! టాస్కుల్లో పాల్గొనడం అటుంచితే గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు, కుదురుగా నడవలేకపోతున్నాడు. తనకు వర్టిగో ఉందన్న విషయాన్ని అతడే స్వయంగా హౌస్‌లో పలుమార్లు వెల్లడించాడు. రోజులు వారాలవుతున్నా అతడి ఆరోగ్యం మాత్రం మెరుగవలేదు. పైగా రోజురోజుకీ అతడిని ఆ వ్యాధి ఇబ్బందిపెడుతూనే ఉంది. దీంతో బిగ్‌బాస్ అతడిని హౌస్ నుంచి పంపించేస్తున్నాడు. అతడికి సీక్రెట్ రూమ్‌లో చికిత్స అందిస్తారా? లేదంటే అటునుంచటే ఇంటికి పంపించేస్తారా? అన్నది శనివారం నాగార్జున క్లారిటీ ఇస్తాడు. ఇంతకీ ఈ వర్టిగో అంటే ఏమిటి? దానివల్ల తలెత్తే సమస్యలేంటి? అనేవి తెలుసుకుందాం.. ► తల తిరగడాన్ని వైద్యపరిభాషలో డిజీనెస్, గిడీనెస్, వర్టిగో అని పిలుస్తున్నారు. ► ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు వస్తుంది. ► వర్టిగో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రంగులరాట్నం మీద తిప్పి అక్కడినుంచి విసిరేసినట్లుగా ఉంటుంది! ► కళ్లు తిరగడం, బ్యాలెన్స్ అదుపు తప్పడం ► గాల్లో తేలినట్లుగా అనిపించడం ► చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించడం ► వర్టిగో రెండు రకాలు: సెంట్రల్ వర్టిగో, పెరిఫరల్ వర్టిగో ► తరచూ తల తిరగడం, విపరీతంగా వాంతులు కావడం, సరిగా నడవలేకపోవడం సెంట్రల్ వర్టిగో లక్షణం. సెంట్రల్ వర్టిగో లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి ► ఒక వైపుకు తిరిగినప్పుడో, ఒక వైపుకు పడుకున్నప్పుడో తల తిరుగుతూ ఉంటుంది. దీన్ని పెరిఫరల్ వర్టిగో అంటారు. చెవిలో ఒక్కోసారి హోరుమని శబ్ధం రావడం, ఒక్కోసారి సడన్‌గా వినికిడి శక్తి మందగించడం వంటి లక్షణాలు కూడా దీనికిందకే వస్తాయి. ► డాక్టర్ ఇచ్చిన ఔషధాలను తీసుకోవడంతో పాటు తగిన వ్యాయామాలు చేయడం వల్ల వర్టిగోను అదుపులో ఉంచవచ్చు. -
ఆసుపత్రి పాలైన ప్రముఖ బాలీవుడ్ నటి
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా ఆసుపత్రి పాలైంది. లవ్ రంజన్ సెట్స్‌పై ఉండగానే ఉన్నట్లుండి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో యూనిట్ సభ్యులు నుష్రత్‌ను వెంటనే ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. మూడు వారాల పాటు విరామం లేకుండా షూటింగ్ చేయడంతో ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు వైద్యులు తెలిపారు. మరో 15 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కాగా కొన్నాళ్ల నుంచి తాను వెర్టిగో సమస్యతో బాధపడుతున్నానని, దీంతో ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోవడం, బలహీనంగా అయిపోవడం లాంటివి జరుగుంటాయని..ఆరోజు కూడా అదే విధంగా జరిగిందని నుష్రత్ తెలిపింది. ఆరోజు షూటింగ్ జరుగుతండగానే నా ఆరోగ్యం కాస్త క్షీణిస్తున్నట్లు అనిపించింది. అప్పటికే నా బీపీ 65/55 కి పడిపోయింది. దీంతో కనీసం నడవలేని స్థితిలో ఉండగా వీల్ చెయిర్‌లోనే ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. అప్పటికే అమ్మానాన్న అక్కడికి చేరుకున్నారు. బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే నేను ఇంకా హాస్పిటల్లోనే ఉంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను అని పేర్కొంది. ప్రస్తుతం నుష్రత్ చేతిలో లవ్ రంజన్‌తో పాటు రామ్‌సేతు, హుర్దాంగ్ సహా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
కళ్లు తిరిగేవాళ్లు ఈ వీడియో చూడకుంటే బెటర్
గుండెదడ.. ఎత్తులో నుంచి చూస్తే కళ్లు గిర్రున తిరిగే అలవాటు మీకు ఉందా.. అయితే.. ఈ వీడియో చూడటం మానేయడమే బెటర్. ఎందుకంటే దాదాపు గుండెజారినంతపనైపోవడం ఖాయం. ఇప్పటి వరకు షార్క్ ఉన్న నీటిలో దూకే సాహసికులను చూశాం.. ఎర్రగా మండే నిప్పుల్లో తాఫీగా పరుగులు పెట్టేవారిని చూశాం.. ఎద్దులతో తీవ్రంగా పోరాడేవారిని చూశాం.. కానీ ఈ వ్యక్తి చేసింది మాత్రం అలాంటి ఇలాంటి సాహసం కాదు.. ఒక పెద్ద బహుళ అంతస్తు చివర్లో కంటెగోడపై నిర్లక్ష్యపు నడక.. అది కూడా అటు ఇటూ జంపింగ్‌లు చేస్తూ పక్క భవనం చివరి అంచుకు ఎగిరి దిగుతూ.. బిల్డిర్ చిన్ పోస్ట్ పేరిట ఫేస్ బుక్ లో ఆగస్టు 9న ఈ వీడియోను పోస్ట్ చేయగా ఇప్పటికే దీన్ని వీక్షించినవారి సంఖ్య కోటి దాటింది. ఇందులో ఓ వ్యక్తి తన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని కనీసం ఆ ఫోన్.. తన ఫేస్ కనిపించకుండా కేవలం దృశ్యాలు మాత్రమే రికార్డయ్యేలా వీడియో తీస్తూ అక్కడికి ఇక్కడి అన్నంతస్తుల భవనంపై గంతులుపెట్టాడు. ఈ వీడియో చూస్తే కళ్లు తిరగడమే కాదు.. కడుపులో ఓ రకమైన వికారంగా కూడా అనిపించవచ్చేమో!