బిగ్‌బాస్‌: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా? | Bigg Boss Telugu 5: Lobo Remuneration For BB5 Telugu | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: లోబో పారితోషికం ఎంతో తెలుసా?

Published Mon, Nov 1 2021 9:11 PM | Last Updated on Fri, Nov 5 2021 2:46 PM

Bigg Boss Telugu 5: Lobo Remuneration For BB5 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ మీద ఇంట్రస్ట్‌తోనే సెలబ్రిటీలు షోలో పాల్గొంటారు. కానీ లోబో మాత్రం కొంత విరక్తి, మరికొంత ఆసక్తితో హౌస్‌లో అడుగుపెట్టాడు. గతంలో బిగ్‌బాస్‌ షో నచ్చదన్నాడు కదా! కానీ మరోసారి జనాలను ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అతడు హౌస్‌లో చేసే కామెడీకి కొదవ లేదు, లోబో అన్నయ్య కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతామని హౌస్‌మేట్‌ ప్రియాంక సింగ్‌ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. కానీ షోలో రాణించాలంటే కామెడీ ఒక్కటే చేస్తే సరిపోదు, టాస్క్‌లు కూడా ఆడాలి! ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాడు లోబో. పైగా మాటిమాటికీ బస్తీలో నుంచి వచ్చాను, బస్తీ వాడిని అని చెప్పడం వల్ల అతడు సింపతీ కోసం ట్రై చేస్తున్నాడని నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడింది.

వెరసి.. లోబో 8వ వారం ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే అతడికి బిగ్‌బాస్‌ నుంచి ఎంత ముట్టిందనేది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. లోబో రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే అతడు వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నాడట! ఈ లెక్కన అతడు రోజుకు దాదాపుగా పాతిక వేల పైచిలుకు వెనకేసినట్లు తెలుస్తోంది. అంటే ఎనిమిది వారాలకు ఏకంగా 15 లక్షల కన్నా ఎక్కువే సంపాదించాడు. అతడు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ముందుగా అనుకున్న డీల్‌ కంటే ఒకింత ఎక్కువే ఉండే అవకాశమూ లేకపోలేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement