
బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటలు సర్వసాధారణం. కానీ మొదటిరోజే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం మాత్రం ఈ సీజన్‌కే చెల్లింది. పలకరింపులు పూర్తయ్యాయో లేదో అప్పుడే చీదరింపులు మొదలెట్టేశారు కంటెస్టెంట్లు. ఇప్పటికే హమీదా, జెస్సీల గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే ఇంట్లో మరో లొల్లి షురూ అయింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఓ ప్రోమో రిలీజైంది.
ఇందులో సిరి హన్మంత్.. లోబోతో జరిగిన వాగ్వాదం గురించి మిగతా కంటెస్టెంట్లతో మాట్లాడుతోంది. ఇంతలో లోబో అడ్డు తగులుతూ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్‌గా తనతో చెప్పమని అరిచాడు. అయితే ఆమె అతడిని చులకన చేస్తూ మాట్లాడటంతో సక్కగ మాట్లాడమని సూచించాడు. నన్ను గెలికితే ఇలాగే ఉంటదని సిరి కౌంటరివ్వడంతో ఒకసారి ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పాడు లోబో. దీంతో చిర్రెత్తిపోయిన సిరి ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని తిట్టిపోసింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇక కాజల్ అత్యుత్సాహాన్ని తట్టుకోలేకపోయింది లహరి. ఎందుకంత హైపర్ అవుతున్నారని కాజల్‌ను సూటిగా ప్రశ్నించింది. దీంతో కాజల్ కంటతడి పెట్టుకుంది. ప్రోమో చూస్తుంటే ఇవాల్టి ఎపిసోడ్‌లో ఫైట్ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment