Bigg Boss 5 Telugu Contestants Lobo Got Movie Offer With Mega Star Chiranjeevi - Sakshi
Sakshi News home page

Lobo: చిరంజీవిని అంటిపెట్టుకుని ఉండే పాత్ర, కల నెరవేరింది

Published Wed, Dec 8 2021 5:51 PM | Last Updated on Thu, Dec 9 2021 8:51 AM

Bigg Boss Telugu 5: Lobo Get Movie Chance With Mega Star Chiranjeevi  - Sakshi

Bigg Boss 5 Telugu Contestants Lobo Got Movie Chance: 'హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్‌' అనే మ్యూజిక్‌ షోతో బాగా పాపులర్‌ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్‌ స్పెషల్‌ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్‌ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్‌ మీద పెద్దగా కనిపించని లోబో ఈ మధ్యే బిగ్‌బాస్‌ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్‌ను పలకరించాడు. బస్తీ నుంచి వచ్చాను, జనాల సపోర్ట్‌ వల్లే ఎదిగాను అంటూ నిత్యం చెప్తూ ఉండే లోబోకు బిగ్‌బాస్‌ షో తర్వాత బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అతడికి స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఇంతకీ ఆ స్టార్‌ హీరో ఎవరనుకుంటున్నారు? మెగాస్టార్‌ చిరంజీవి. ఈమధ్యే చిరంజీవి లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్‌ ఉంది, వచ్చి చేయమని చెప్పారట! ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనది చిరును అంటిపెట్టుకుని ఉండే పాత్ర అని, మెగాస్టార్‌ పక్కన ఉండి నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని సంబరపడుతున్నాడు. ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే లోబో.. మెహర్‌ రమేశ్‌- చిరంజీవి కాంబోలో వస్తున్న 'భోళా శంకర్‌' సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement