ఎలిమినేషన్‌: ఈసారి లోబోను ఎవరూ కాపాడలేరు! | Bigg Boss Telugu 5: Lobo May Be Eliminate This 8th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Elimination: అప్పుడు తప్పించుకున్నాడు, కానీ ఈవారం కష్టమే!

Published Wed, Oct 27 2021 7:56 PM | Last Updated on Thu, Oct 28 2021 1:25 PM

Bigg Boss Telugu 5: Lobo May Be Eliminate This 8th Week - Sakshi

Bigg Boss 5 Telugu, 8th Week Elimination: బిగ్‌బాస్‌ షోలో ప్రేక్షకులకు ఎక్కువ కిక్కేచ్చేవి రెండే రెండు. ఒకటి నామినేషన్‌, రెండు ఎలిమినేషన్‌. సోమవారం నామినేషన్స్‌ తంతు పూర్తవగానే సండే ఎలిమినేషన్‌ ప్రక్రియ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు వీక్షకులు. అయితే ఎవరు నామినేషన్‌లో ఉన్నారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతున్నారు? అన్న విషయాలను ఎపిసోడ్‌ ప్రసారమవడాని కంటే ముందే లీక్‌ చేసి అసలైన మజాను పోగొడుతున్నారు లీకువీరులు. అయినప్పటికీ ఎలిమినేట్‌ అయినప్పుడు వారి భావోద్వేగాలను, స్టేజీపై వారు మాట్లాడే మాటలను వినాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు బిగ్‌బాస్‌ లవర్స్‌. ఇక ఈసారి కూడా ఎవరు బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడబోతున్నారు? అని చర్చలు మొదలెట్టేశారు.

అయితే ఈసారి ఎలిమినేషన్‌ వార్‌ వన్‌సైడ్‌ అవనున్నట్లు కనిపిస్తోంది. అదెలాగంటే.. ఎనిమిదవ వారం రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జశ్వంత్‌, మానస్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో రవి ఈ సీజన్‌ ప్రారంభం నుంచి ప్రతివారం నామినేట్‌ అవడం, తనకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో సేవ్‌ అవడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి రవి బెర్త్‌కు ఢోకా లేదు. యూట్యూబ్‌ సంచలనం షణ్ముఖ్‌కు సైతం యూత్‌లో మంచి పాపులారిటీ ఉంది. అతడు నామినేషన్‌లోకి రావడమే తరువాయి ఓట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అనఫీషియల్‌ ఓటింగ్‌లో భారీ ఓట్లతో టాప్‌ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. అధికారిక ఓటింగ్‌లోనూ అతడు ముందువరుసలో ఉండే ఛాన్స్‌ ఉంది. ఇక శ్రీరామచంద్ర, మానస్‌.. ఇద్దరూ మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్నవారే. లేనిపోని గొడవలు పెట్టుకోకుండా, ఏ తగవుల్లోనూ దూరకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. రోజురోజుకీ వీళ్లిద్దరి గ్రాఫ్‌ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ ఇద్దరినీ అభిమానులు ఇంకొన్నాళ్లు కాపాడుకుంటారే తప్ప అప్పుడే షో నుంచి జారవిడుచుకోరు. 

మిగిలిందల్లా సిరి, లోబో. ఈ ఇద్దరే ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. కానీ ఎలిమినేషన్‌ కత్తి ప్రధానంగా వేలాడుతోంది లోబోపైనే. ఎందుకంటే గడిచిన ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిలను షో నుంచి పంపించేసి బిగ్‌బాస్‌ పక్షపాతం చూపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి తరుణంలో మరోసారి అమ్మాయినే పంపించేసి చేతులు కాల్చుకునే సాహసం చేయదు బిగ్‌బాస్‌ టీమ్‌. ముఖ్యంగా గ్లామర్‌ కంటెంట్‌ తగ్గిపోయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్‌ చేయడానికైనా సిరిని ఇంకొన్నాళ్లు కొనసాగించే అవకాశం ఉంది. పైగా టాస్కుల్లో లోబో కంటే మెరుగ్గా ఆడుతోంది.

ఇక లోబో విషయానికి వస్తే.. ఆరోవారంలో అమ్మాయిని పంపించకూడదని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఓ నిర్ణయానికి వస్తే గనుక శ్వేతవర్మ స్థానంలో ఎలిమినేట్‌ అ‍య్యేది లోబోనే! కానీ సీక్రెట్‌ రూమ్‌తో అతడిని ఆ గండం నుంచి గట్టెక్కించారు. కానీ ఈ వారం మాత్రం అతడిని ఎవరూ కాపాడలేరని తెలుస్తోంది. సీజన్‌ ప్రారంభమైన మొదట్లో లోబో బాగానే ఎంటర్‌టైన్‌ చేసినా రానురానూ డల్‌ అయిపోయినట్లు కనిపించింది. టాస్కుల్లోనూ ఎక్కడా పనితనం చూపకపోవడంతో స్వయంగా నాగార్జునే టాస్కుల్లోనూ కాస్త యాక్టివ్‌గా ఉండవయ్యా అంటూ చురకలంటించాడు. సీక్రెట్‌ రూమ్‌ ఎపిసోడ్‌ తర్వాత అతడు ఆటపై కొంత ఫోకస్‌ పెట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ 50 రోజుల్లో మిగతా కంటెస్టెంట్లు అందరూ టాస్క్‌ల్లో చురుకుగా పాల్గొంటూ తమ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోగా లోబో మాత్రం కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకుని ఒకే దగ్గర ఉండిపోయాడు. ఏ విధంగా చూసుకున్న లోబో ఈ వారం ఎలిమినేట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. లేదు, అతడిని ఎలాగైనా కాపాడుకుంటాం అని బిగ్‌బాస్‌ నిర్వాహకులు అనుకుంటే మాత్రం సిరి బలవక తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement