బిగ్‌బాస్‌: అర్ధ పావు భాగ్యం కామెడీతో అల్లాడిస్తుందిగా | Bigg Boss Telugu 5 Promo: Lets Have Some 5 Much Fun | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: సిరికి, షణ్నుకు ముడిపెట్టిన ఉమాదేవి

Published Thu, Sep 16 2021 5:41 PM | Last Updated on Thu, Sep 16 2021 9:42 PM

Bigg Boss Telugu 5 Promo: Lets Have Some 5 Much Fun - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. కూల్‌ అనుకున్నవాళ్లు ఉగ్రరూపం చూపిస్తుంటే అమాయకులు అనుకున్నవాళ్లు యాటిట్యూడ్‌ చూపిస్తున్నారు. ఇక బూతులు మాట్లాడుతూ షోను పెంటపెంట చేస్తున్న కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవిని ఆపడం మాత్రం ఎవరి వల్లా కావట్లేదు. అయితే ఆమెకు కాస్త నచ్చజెప్పుదామని చూసిన సన్నీ..  కాస్త ప్రేమగా మాట్లాడమని సలహా ఇవ్వగా.. కోపంలోనే ప్రేమను వెతుక్కోమని బదులిచ్చింది. తరచూ హౌస్‌మేట్స్‌తో గొడవలు పెట్టుకునే ఆమెకు నెటిజన్లు గయ్యాలి గంప అన్న బిరుదు కూడా ఇచ్చేశారు.

కానీ అదేంటో విచిత్రంగా నేటి ఎపిసోడ్‌లో మాత్రం ఉమా తన కోపాన్ని అటకెక్కించి అందరినీ నవ్వించాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో లోబో, ఉమా వేర్వేరు స్కిట్లతో నవ్వించడానికి రెడీ అయ్యారు. ముందుగా లోబో.. పింకీతో కలిసి తెగ నవ్వించాడు. తర్వాత ఉమా.. సిరికి షణ్నుకు ముడి పెడుతూ కామెడీ పండించింది. మరి వీరి స్కిట్లు చూసి ఎంజాయ్‌ చేయాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! అయితే ఈ ప్రోమో చూసిన జనాలు.. హౌస్‌లో ఉమా చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ వేరే లెవల్‌లో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. తను ఉంటేనే హౌస్‌కు కళ అని, ఈ వారం తను ఎలిమినేట్‌ కాకూడదని కోరుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement