
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం 'శక్తి చూపరా డింభకా' టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే ఈ టాస్కులో విశ్వ, మానస్‌లు గెలుపొందారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా సిరి హన్మంత్ పవర్ రూమ్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తద్వారా పవర్ రూమ్‌లోకి ప్రవేశించిన సిరికి ఇంట్లో ఎవరైనా ఇద్దరిని సెలక్ట్ చేసుకోమన్నాడు బిగ్‌బాస్. ఆ ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని ఆదేశించాడు. దీనికోసం సిరి... షణ్ముఖ్‌కు లోబో సేవకుడిగా ఉంటాడని వివరించింది.
దీంతో లోబో.. షణ్నూకు మసాజ్ చేస్తూ కనిపించాడు. షణ్నూకు అన్ని పనులు చేసిపెడుతున్న లోబోను రవి పనోడివి అని వర్ణించడంతో అందరూ ఫక్కున నవ్వారు. తనను ముప్పుతిప్పలు పెడుతున్నందుకు సతమతమయ్యాడు లోబో. ఇంతలో సిరిని పవర్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. మరోపక్క హమీదా, లహరి మధ్య ఏదో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో హమీదా మరోసారి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ సిరికి బిగ్‌బాస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? హమీదా, లహరి గొడవలో తప్పెవరిది? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment