నా కల నిజమైంది, లోబో ఎమోషనల్‌ | Lobo Confirms He Gets Chiranjeevi Bhola Shanka Movie Offer | Sakshi
Sakshi News home page

Chiranjeevi-Lobo: నా కల నిజమైంది, లోబో ఎమోషనల్‌

Dec 9 2021 5:59 PM | Updated on Dec 9 2021 9:14 PM

Lobo Confirms He Gets Chiranjeevi Bhola Shanka Movie Offer - Sakshi

ఒక‌ప్పుడు టీవీ షోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన లోబో ఇటీవల బిగ్‌బాస్‌ ఆఫ‌ర్ కొట్టెశాడు. సీజ‌న్ 5లో పాల్గొన్న ఆయ‌న త‌న కామెడీతో హౌజ్‌మేట్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. సీక్రెట్ రూంలో ఉన్నా కూడా గేమ్‌ని మార్చుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు లోబో. ఈ క్రమంలో అతడికి సినిమా ఆఫ‌ర్స్ త‌లుపుతడుతున్నాయని, ఏకంగా చిరు సినిమాలోనే నటించే చాన్స్‌ కొట్టేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి పిలిచి మరి తన సినిమాలో ఆఫర్‌ ఇచ్చారని స్వయంగా లోబోనే వెల్లడించాడు.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరుతో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘నా కల నిజమైంది. చిరంజీవి సార్‌ సినిమాలో ఆఫర్‌ వచ్చింది’ అంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం చిరంజీవి- మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వంలో తమిళ చిత్రం వేదాళం రీమేక్‌గా ‘భోళా శంక‌ర్’ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement