Bigg Boss Telugu 5, Episode 52: బిగ్‌బాస్ ఇంట్లో ఎనిమిదోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. లోబో, షణ్ముఖ్ ఆవుపేడతో ఆటలాడగా.. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. మరి ఈ టాస్కుల్లో ఎవరుగెలిచారు. హౌస్‌ని లాక్‌డౌన్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ ఎందుకు ప్రకటించారు. ఇంట్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ పడ్డ కష్టాలేంటో నేటి ఎపిసోడ్ చదివేద్దాం.
సిరికి షణ్ముఖ్ గోరు ముద్దలు
నామినేషన్ ప్రక్రియలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని సిరికి చెప్పాడు షణ్మఖ్. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ.. తన గోడునంతా చెప్పుకున్నాడు. అందరిలాగే తనకు కూడా అమ్మ మొదటిసారే లెటర్ రాసిందని.. అందరు చెపుకుంటారు, మనం చెప్పుకోము అంతే తేడా అన్నాడు. అలాగే విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, నామినేషన్ అంటే ఆయన భయమని చెప్పాడు.
టాప్ 5లో నేను, మానస్ ఉంటాం : ప్రియాంక
బెడ్‌రూమ్ ఏరియాలో పింపీ, సిరి, మానస్ ముచ్చట్లు పెట్టారు. ఈ సారి నామినేషన్‌లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్ అడగ్గా.. అవును ఒక గర్ల్, ఐదుగురు బాయ్స్ ఉన్నారని సిరి చెప్పింది. పింకి ఈ సారి కూడా నామినేషన్‌లో లేరని సిరి అనగా.. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించించగా.. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులేని కౌంటర్ ఇచ్చింది పింకి. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్ కోరుకోగా.. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది.
షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ: యాంకర్ రవి
ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్‌ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ షన్ను పరువు తీశాడు రవి.
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్..‘అభయహస్తం’
కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్‌డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి, అలాగే ఇంట్లోకి వెళ్లడానికి ఐదు చాలెంజ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఈ చాలెంజ్‌లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. అలాగే ఒక చాలెంజ్‌లో ఓడినవారు ఇంటి సభ్యులను ఒప్పించి మిగతా చాలెంజ్‌లలో కూడా పోటీపడొచ్చు.
మొదటి చాలెంజ్..మట్టిలో ముత్యాలు
ఈ చాలెంజ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో బాత్‌టబ్‌లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉన్నాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే విజేతలు. ఒక్కోసారి ఒక్కో ముత్యాన్ని మాత్రమే వేయాలి. ఈ టాస్క్‌కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలు వెళ్లారు. ఇందులో టాస్క్‌లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే షణ్ముఖ్ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా.. నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ.. షణ్ముఖ్‌ని విన్నర్‌గా ప్రకటించడంతో సిరి ఎగిరిగంతేసి షణ్ముఖ్‌ని గట్టిగా కౌగిలించుకుంది.
రెండో చాలెంజ్ గాలం మార్చే మీ కాలం
రెండో చాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్ రాడ్‌తో బయటకు తీయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్‌ని బయటకు తీస్తారు వారే విజయం సాధించినట్లు. దీని కోసం రవి, సిరి హోరా హోరిగా పోటీపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది.
మూడో చాలెంజ్.. తాడులు తకదిమి
మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే రోప్‌లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. ఆపేసిన వారు ఓడిపోతారు. దీని కోసం శ్రీరామచంద్ర, మానస్ పోటీ పడ్డారు. ఇద్దరు చెమటలు వచ్చేలా తాడులను ఊపారు. చివరకు మానస్ భరించలేక తాడులను వదిలేయడంతో శ్రీరామ్ విజయం సాధించాడు. అయితే మిగిలిన టాస్క్‌లతో పోల్చితే ఈ టాస్క్ కోసం శ్రీరామచంద్ర చాలా కష్టపడ్డాడు. చెమటలు వచ్చినప్పటికీ.. తాడులను ఊపడం ఆపలేదు. దీంతో మూడో విజేతగా నిలిచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ దారులుగా షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు. మరి వారిలో ఏ ఇద్దరు చాలెంజ్‌లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులైన షన్నూ, సిరి, శ్రీరామ్‌లతో పోటీపడ్డారు? ఈ వారం కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment