Bigg Boss 5, 8th Week Elimination: Lobo Exit From BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5 Elimination: ఈ వారం ఎలిమినేట్ అయింది అత‌డే!

Oct 30 2021 9:08 PM | Updated on Oct 31 2021 8:42 AM

Bigg Boss 5 Telugu: Lobo Exit From BB House - Sakshi

అటు అఫీషియ‌ల్ ఓటింగ్‌లోనూ లోబో వెన‌క‌బ‌డిన‌ట్లు స‌మాచారం! ఫ‌లితంగా ఈ వారం లోబో.. హౌస్ నుంచి త‌న బ‌స్తీకి ప‌య‌న‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది...

Bigg Boss 5 8th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజ‌న్‌లో ఎలిమినేష‌న్ ఎపిసోడ్‌ ప‌స లేకుండా పోతోంది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఒక‌రోజు ముందే లీక‌వ‌డంతో స‌స్పెన్స్‌కు స్థానం లేకుండా పోయింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, మానస్ నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో ర‌వి, శ్రీరామ్, మాన‌స్‌, ష‌ణ్ముఖ్‌ల‌కు ఓటింగ్ ప‌రంగా ఢోకా లేదు. వీళ్లంద‌రికీ సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది, కాబ‌ట్టి ఈజీగా ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.. ఎటొచ్చీ సిరి, లోబోల‌నే ఎలిమినేష‌న్ గండం వెంటాడుతోంది. వీళ్లిద్ద‌రిలో లోబో క‌న్నా సిరి బెట‌ర్ అన్న‌ది చాలామంది అభిప్రాయం.

ఆమె టాస్కులు ఆడుతూ, గొడ‌వ‌లు పెట్టుకుంటూ, ష‌ణ్నూ ద‌గ్గ‌ర అలుగుతూ, ఏదో ఒక‌ర‌కంగా స్క్రీన్ స్పేస్ సంపాదించుకుంటూ వ‌స్తోంది. లోబో మొద‌ట్లో ఎంట‌ర్‌టైన్ చేసినా రానురానూ డ‌ల్ అయిపోయాడు. అత‌డు బాగా ఆడాడు అని చెప్పుకోవ‌డానికి ఒక‌టీ, రెండు టాస్కులు మిన‌హా పెద్ద‌గా ఏమీ లేవు. పైగా ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిల‌ను పంపించివేయడంపై బిగ్‌బాస్‌పై గ‌ర‌మ‌వుతున్నారు నెటిజ‌న్లు. అమ్మాయిల‌ను విన్న‌ర్ చేయొద్ద‌ని ముందే డిసైడ్ అయిన‌ట్లున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం కూడా అమ్మాయినే పంపించివేస్తే మ‌రింత విమ‌ర్శ‌ల‌పాల‌వ‌డం ఖాయం. దీనికి తోడు అన‌ధికారిక పోల్స్‌లోనూ లోబోకు త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. అటు అఫీషియ‌ల్ ఓటింగ్‌లోనూ లోబో వెన‌క‌బ‌డిన‌ట్లు స‌మాచారం! ఫ‌లితంగా ఈ వారం లోబో.. హౌస్ నుంచి త‌న బ‌స్తీకి ప‌య‌న‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement