ఎలిమినేషన్‌: డేంజర్‌ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు! | Bigg Boss Telugu 5: Nataraj And Anee Master High Elimination Chances | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Elimination: ఆ ఇద్దరిపై వేలాడుతున్న ఎలిమినేషన్‌ కత్తి!

Published Fri, Oct 1 2021 5:23 PM | Last Updated on Fri, Oct 1 2021 6:16 PM

Bigg Boss Telugu 5: Nataraj And Anee Master High Elimination Chances - Sakshi

Bigg Boss 5 Telugu, 4th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున సెప్టెంబర్‌ 5న ఈ షోను ప్రారంభించాడు. షో మొదలైన తొలి రోజే 18 టీఆర్పీ రేటింగ్‌ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రారంభమైంది బిగ్‌బాస్‌. అయితే ఎక్కువ మంది హౌస్‌మేట్స్‌ ఉండటంతో ప్రతివారం నామినేషన్‌ లెక్కలు మారుతూ వస్తున్నాయి.. ఫస్ట్‌ వీక్‌లో ఏడుగురు నామినేషన్‌లోకి రాగా కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి ఎలిమినేట్‌ అయింది. రెండోవారంలో ఆరుగురు నామినేట్‌ అవగా బూతులతో బెంబేలెత్తించే సరయూ హౌస్‌ నుంచి వెళ్లిపోయింది. తర్వాత మూడో వారం ఐదుగురు మాత్రమే నామినేషన్‌లోకి వచ్చారు. వీరిలో నుంచి లేడీ అర్జున్‌ రెడ్డి లహరి షారి ఎలిమినేట్‌ అయింది. అలా ఇప్పటివరకు ముగ్గురు ఆడవాళ్లే హౌస్‌ నుంచి నిష్క్రమించారు. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ వారం ఎనిమిది మంది నామినేట్‌ అయ్యారు. లోబో, ఆర్జే కాజల్‌, సిరి హన్మంత్‌, యానీ మాస్టర్‌, ప్రియ. యాంకర్‌ రవి, నటరాజ్‌ మాస్టర్‌, వీజే సన్నీ నామినేషన్‌లో ఉన్నారు. అయితే అనధికారిక పోల్స్‌లో వీజే సన్నీ ఎక్కువ ఓట్లు సాధిస్తూ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. తర్వాత ప్రియకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్‌ అందుతున్నట్లు తెలుస్తోంది. యాంకర్‌ రవి మాత్రం మూడో స్థానానికే పరిమితం అయ్యాడు. తర్వాతి స్థానాల్లో సిరి హన్మంత్‌, ఆర్జే కాజల్‌ ఉన్నారు. మిగిలిందల్లా లోబో, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌.

నిన్నటివరకూ డేంజర్‌ జోన్‌లో ఉన్న లోబోకు కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ తర్వాత ఒక్కసారిగా ఓట్లు పెరిగినట్లు సమాచారం. దీంతో అతడు కూడా సేఫ్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన యానీ, నటరాజ్‌ మాస్టర్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేషన్‌ను ఎదుర్కోబోతున్నారు. సోషల్‌ మీడియాలో తక్కువ ఫాలోయింగ్‌ ఉన్న వీళ్లిద్దరికీ మిగిలిన అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆడవాళ్లనే పంపించారు కాబట్టి ఈసారి మేల్‌ కంటెస్టెంట్‌ను పంపించేందుకు ఆస్కారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మొత్తంగా ఈ వారం ఒక కొరియోగ్రాఫర్‌ బిగ్‌బాస్‌ను వీడి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement