Bigg Boss 5 Telugu, Natraj Master Supports VJ Sunny: నా రూటే సెపరేటు అన్నట్లుగా నడుచుకుంటూ అందరితో కయ్యానికి దిగుతూ నాలుగువారంలోనే ఎలిమినేట్ అయ్యాడు నటరాజ్ మాస్టర్. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక అతడు ఎవరికీ సపోర్ట్ ఇవ్వలేదు. తాజాగా మాత్రం ముగ్గురికీ మరీ ముఖ్యంగా ఒకరికి మద్దతునిస్తున్నాడు. 'ఎవరు విన్ అవుతారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. నేనైతే శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముఖ్.. ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నా. షణ్ముఖ్‌కు ఎందుకు సపోర్ట్ అంటే.. ఒకరి ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల జనాల్లో కొంత ఇబ్బందిపడుతున్నా నామినేషన్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉండేవాడు. శ్రీరామచంద్రకు సపోర్ట్ ఎందుకంటే? అతడు చాలావరకు నిజమే మాట్లాడేవాడు, అనిపించింది చెప్పేవాడు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇన్‌ప్లూయెన్స్ అయ్యాడనిపించింది'
'ఇక సన్నీ గురించి.. ఫస్ట్‌లో అతడు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు. ఎవరేం చెప్పినా నమ్మేసేవాడు. కాకపోతే అందరితో సరదాగా ఉండేవాడు. ముగ్గురికీ సపోర్ట్ చేసినప్పుడు ఒక చిన్న పాయింట్ ఏమనిపించిందంటే శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ విన్నర్. షణ్ముఖ్ యూట్యూబ్‌లో నెంబర్ 1. సన్నీ చాలారోజుల నుంచి కష్టపడుతున్నాడు.. అతడికి మంచి లైఫ్ రావాలనిపించింది. జనాలను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం ముఖ్యం. అది సన్నీ చేశాడు. తన జర్నీ చూసి నవ్వుకున్నాను, ఫీల్ కూడా వచ్చింది. తనను ఇష్టపడేవాళ్లను సన్నీ సూపర్‌గా ఇష్టపడతాడు. నచ్చకపోతే కొంచెం అగ్రెసివ్ అవుతాడు'
ముగ్గురూ గెలవాలని ఉంది, కానీ ఒక్కరికే ఛాన్స్ కాబట్టి సన్నీ విన్ అవ్వాలని ఉంది. ఇన్నిరోజులు ఎందుకు ఆగానంటే వీళ్లు చివరి వరకు ఎలా ఉంటారో చూద్దామనుకున్నా. నిన్న సన్నీని ఇష్టమొచ్చినట్లు అంటూ కోపమొచ్చేలా చేశారు. అయినా సరే కంట్రోల్ అయ్యాడు. ఆ ప్లేస్‌లో నేనుంటే ఆగేవాడినే కాదు. తనని అలా చూస్తే బీపీ వచ్చేసింది. నరాలు తెగిపోయాయి. సన్నీ మాత్రం కంట్రోల్‌గా ఉన్నాడు. హ్యాట్సాఫ్ సన్నీ. సీరియల్ కూడా వదిలేసి బిగ్‌బాస్ చేస్తున్నాడు. అతడు గెలవాలని గట్టిగా పీలవుతున్నా. నా సపోర్ట్ కచ్చితంగా సన్నీకే. అతడికి సపోర్ట్ చేయండి' అని పిలుపునిచ్చాడు నటరాజ్ మాస్టర్.
Comments
Please login to add a commentAdd a comment