
Bigg Boss 5 Telugu, 7th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఏడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని లీకువీరులు మరోసారి సోషల్ మీడియాలో లీక్ చేసేశారు. ముందుగా కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశారట! యానీ తన సొంత కూతురుగా భావించే శ్వేత వర్మను గతవారం హౌస్ నుంచి పంపించేయగా ఈసారి యానీనే ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ షోలో ఈ తల్లీకూతుళ్ల బంధానికి ముగింపు పలికారంటూ ప్రచారం చేశారు. కానీ కాసేపటికే మళ్లీ ఎలిమినేట్ అయింది యానీ కాదు ప్రియ అంటూ కొత్త పేరు తెరపైకి తీసుకొచ్చారు.
నిజానికి నామినేషన్స్ జరిగిన రోజు యానీ వెళ్లిపోయే సూచనలున్నాయని బలంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే ఐదుగురు ఆడవాళ్లు.. సరయు, ఉమాదేవి, లహరి షారి, హమీదా, శ్వేత వర్మ షో నుంచి నిష్క్రమించడంతో ఈసారి మేల్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే ఆస్కారం కూడా ఉండొచ్చని భావించారు. కానీ బిగ్‌బాస్ ఈ అంశాన్ని పెద్దగా లెక్క చేయనట్లు తెలుస్తోంది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో ప్రియ, సన్నీ మధ్య పెద్ద ఫైట్ జరిగింది. చెంప పగలగొడతానంటూ ఏకంగా పూల కుండీతో సన్నీని కొట్టబోయింది ప్రియ. ఆమె ప్రవర్తన చాలామందికి విస్మయం కలిగించగా ఈ గొడవ వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో ఓటింగ్‌లోనూ మార్పులు వచ్చాయి, ప్రియకు ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో ఫైనల్‌గా ప్రియ, యానీలలో ఎవరు వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది. అయితేక కొందరు యానీ బయటకు వెళ్తారని అంటుంటే మెజారిటీ నెటిజన్లు ప్రియ ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే నాగార్జున అధికారికంగా వెల్లడించేవరకు వెయిట్ చేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment