'టచ్‌ చేయకు, నా దగ్గరకు రాకు తల్లీ' యానీ నాగిణి డ్యాన్స్‌ | Bigg Boss 5 Telugu: Anee Master Loosing Words And Actions | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: నన్ను టచ్‌ చేస్తే డిస్‌క్వాలిఫై చేస్తా.. యానీ మాస్టర్‌

Published Fri, Nov 12 2021 7:02 PM | Last Updated on Fri, Nov 12 2021 8:35 PM

Bigg Boss 5 Telugu: Anee Master Loosing Words And Actions - Sakshi

Bigg Boss 5 Telugu Promo, Anee Vs Kajal: కెప్టెన్సీ కంటెండర్స్‌​ టాస్క్‌ బీబీ హోటల్‌లో సరదాగా ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్‌ టవర్‌లో ఉంది పవర్‌లో మాత్రం కొట్లాటలకు దిగారు. సిరి, సన్నీ, కాజల్‌, రవి కెప్టెన్సీకి పోటీ పడగా మిగతా ఇంటిసభ్యులు వారికి మద్దతిచ్చారు. ఈ క్రమంలో కాజల్‌.. రవికి సపోర్ట్‌ చేస్తున్న యానీ మాస్టర్‌కు కితకితలు పెట్టి ఆమె ఆటను డిస్టర్బ్‌ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఎప్పటిలాగే యానీ దీన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంది.

ఇలా చేశావంటే ఈ టాస్క్‌లో నీపై అనర్హత వేటు వేస్తానని కాజల్‌ను హెచ్చరించింది. నువ్వు ఈ గేమ్‌లో ఓడిపోయాక ఎవరికి సపోర్ట్‌ చేస్తున్నావని అడిగింది. అందుకామె రవికి అని సమాధానమివ్వడంతో షాకైన యానీ.. రవికి సపోర్ట్‌ అంటూనే అతడికి మద్దతుగా నిలబడ్డవాళ్లకు గిలిగింతలు పెడతావా? అని నిలదీసింది. ఇందుకు కాజల్‌ నా గేమ్‌ అదే అని చెప్పింది. ఈ సమాధానంతో షాకైన యానీ.. 'నన్ను టచ్‌ చేయకు, నా దగ్గరకు రాకు తల్లి' అంటూ ఆవేశపడుతూ నాగిని డ్యాన్స్‌ చేసింది. 'నా పైసలు దొంగిలించావు, ఒక్క గేమ్‌ నిజాయితీగా ఆడలేదు' అని విమర్శించింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు యానీ విశ్వరూపాన్ని చూసి మహానటి సాంగ్‌ ఆమెకు డెడికేట్‌ చేస్తున్నారు. ఆమె ఎందుకిలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదని కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement