Bigg Boss 5 Telugu 76th Episode: Anchor Ravi Feels VJ Sunny Will Be Eliminated This Week - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ వ‌చ్చినా స‌న్నీనే ఎలిమినేట్ అవుతాడు!

Published Fri, Nov 19 2021 11:35 PM | Last Updated on Sat, Nov 20 2021 10:01 AM

Bigg Boss 5 Telugu: Anchor Ravi Feels VJ Sunny Will Be Eliminated This Week - Sakshi

Bigg Boss 5 Telugu, Task For Eviction Free Pass: బిగ్‌బాస్ హౌస్‌లో సిరి, ప్రియాంక సింగ్‌, యానీ, మాన‌స్ కెప్టెన్సీ కోసం పోటీ ప‌డ్డారు. రింగ్ ఈజ్ కింగ్‌ టాస్క్‌లో ఎవ‌రు రింగ్‌ను చివ‌రి వ‌ర‌కు ప‌ట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మాన‌స్ గెలిచి విజేత‌గా అవ‌త‌రించాడు. కెప్టెన్ మాన‌స్‌ కాజ‌ల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఎలిమినేష‌న్‌ నుంచి సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ప్ర‌వేశ‌పెట్టాడు. 'నిప్పులే శ్వాస‌గా.. గుండెలో ఆశ‌గా' టాస్క్‌లో మీ ఫొటో కాల‌కుండా చూసుకోవాలని, చివ‌రి వ‌ర‌కు ఎవరి ఫొటో కాల‌కుండా ఉంటుందో ఆ కంటెస్టెంట్‌కు ఈ పాస్ ద‌క్కుతుంద‌ని ప్ర‌క‌టించాడు.

అయితే త‌న‌కెందుకో ఈ వారం స‌న్నీ ఎలిమినేట్ అవుతాడ‌నిపిస్తోంద‌ని ర‌వి జోస్యం చెప్పాడు. ఒక‌వేళ‌ ఎవిక్ష‌న్ పాస్ గెలిచినా కూడా స‌న్నీ దాన్ని వాడుకోడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. త‌ర్వాత టాస్క్‌లో భాగంగా ఫైర్ ఇంజ‌న్ అలార‌మ్ మోగ‌గా ర‌వి, ష‌ణ్ముఖ్ మొద‌ట ట్ర‌క్ ఎక్కారు. వీరికి మాన‌స్‌, శ్రీరామ్‌ ఫొటోలు వ‌చ్చాయి. ష‌ణ్ను సేవ్ చేసే అవ‌కాశం మాన‌స్‌కిద్దామంటే ర‌వి మాత్రం శ్రీరామ్‌కే ఇద్దామ‌ని ఒప్పించాడు. అలా మాన‌స్ ఫొటో మంట‌ల్లో కాలిపోయింది. నెక్స్ట్ రౌండ్‌లో స‌న్నీ, మాన‌స్ ట్ర‌క్ ఎక్కారు. వీరి ఎదుట ర‌వి, యానీ మాస్ట‌ర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో ర‌వి ఫొటోను కాల్చేశారు.

ష‌ణ్ను, సిరిలు ట్ర‌క్ ఎక్క‌గా వారు పింకీని కాకుండా స‌న్నీని సేవ్ చేశారు. త‌ర్వాత యానీ, శ్రీరామ్‌ల వంతు రాగా జనాల ఓటింగే నాకు ముఖ్యం, ఈ పాస్ అవ‌స‌రం లేద‌న్నాడు ష‌ణ్ను. ఆడియ‌న్స్‌ స‌పోర్ట్‌తోనే ఇక్క‌డిదాకా వ‌చ్చాను, వారి డెసిష‌న్‌తోనే వెళ్లిపోవాల‌ని ఉంద‌ని చెప్పుకొచ్చింది సిరి. వీళ్లిద్ద‌రూ త‌మ‌కీ పాస్ అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ప్ప‌టికీ యానీ, శ్రీరామ్ ఆలోచించుకుని సిరిని సేవ్ చేశారు. దీంతో ఆమె సంతోషంతో ష‌ణ్నును హ‌త్తుకుని అత‌డికి ఐ ల‌వ్‌యూ చెప్పింది.

ప్రియాంక‌, కాజ‌ల్‌.. శ్రీరామ్‌, సిరిల‌లో నుంచి సిరిని సేవ్ చేశారు. యానీ, ప్రియాంక‌లకు స‌న్నీ, కాజ‌ల్ ఫొటోలు వ‌చ్చాయి. యానీ.. ఆ రెండు ఫొటోలు కాల్చేద్దామ‌ని చెప్పింది. కానీ పింకీ అది త‌ప్ప‌ని వారించ‌డంతో ఇద్ద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చి కాజ‌ల్ ఫొటోను కాల్చేసి స‌న్నీని సేవ్ చేశారు. త‌ర్వాత అలార‌మ్ మోగిన‌ప్పుడు ట్ర‌క్‌లో కూర్చున్న మాన‌స్‌, కాజ‌ల్‌ల‌కు యానీ, సిరి ఫొటోలు వ‌చ్చాయి. ఇద్ద‌రూ ఏకాభిప్రాయానికి రాలేక‌పోయారు. ఇద్ద‌రూ కాలిపోతే స‌న్నీ గేమ్‌లో ఉంటాడని కాజ‌ల్ అభిప్రాయ‌ప‌డింది. త‌న ఫొటోను కాల్చేస్తార‌ని భ‌య‌ప‌డిపోయిన యానీకి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. త‌న‌కు పాస్ ద‌క్కుండా చేస్తున్నార‌ని మండిప‌డిపోయింది. సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కైతే ఈ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ స‌న్నీకి ద‌క్కిన‌ట్లు స‌మాచారం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement