
తాజాగా లీకువీరులు మాస్టర్ ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవన్నీ నిజమయ్యాయి. పైగా మొదటి నుంచీ...
Bigg Boss 5 Telugu, 11th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంటోంది. 19 మందితో మొదలైన ఈ గేమ్ షోలో ప్రస్తుతం 9 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం సన్నీ, కాజల్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, యానీ మాస్టర్, రవి, శ్రీరామ్, మానస్ మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరు ఫైనల్ వరకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ వారం రవి మినహా.. మిగతా 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. నామినేషన్ జరిగిన మరుసటి రోజు నుంచే యానీ వెళ్లిపోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అనధికారిక పోల్స్‌లోనూ యానీ చివరి స్థానంలో ఉంటూ ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తాజాగా లీకువీరులు మాస్టర్ ఎలిమినేట్ అయిందని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవన్నీ నిజమయ్యాయి. పైగా మొదటి నుంచీ ఓటింగ్‌లో వెనకబడింది కాబట్టి యానీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిందన్న వార్త నిజమే అయి ఉండొచ్చని భావిస్తున్నారు నెటిజన్లు. కాజల్‌ను నాగిని అంటూ ఆమె ముందు కుప్పిగంతులు వేసిన యానీ రేపు నాగిని డ్యాన్స్ చేస్తూనే వెళ్లిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.