
సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ.
Bigg Boss Telugu 5, Anee Master Bigg Boss Buzz Video: బిగ్‌బాస్ హౌస్‌లో 11 వారాల జర్నీకి ఫుల్‌స్టాప్ పెట్టింది యానీ మాస్టర్. ఆమెను మరికొద్ది రోజులు హౌస్‌లో ఉంచేందుకు ప్రేక్షకులు విముఖత చూపించడంతో షో నుంచి ఎలిమినేట్ అయింది. భారంగా బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలికింది. బయటకు వచ్చిన వెంటనే అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. అరియానాకిచ్చిన ఇంటర్వ్యూలో హౌస్‌మేట్స్ గురించి యానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ.
కాజల్ గురించి చెప్తూ.. ఒకరు చచ్చిపోతుంటే కూడా ముందు నీ స్ట్రాటజీ ఏంటో చెప్పంటూ గుచ్చిగుచ్చి అడుగుతుందని కామెంట్ చేసింది. హౌస్‌లో ఇప్పటికీ నటిస్తున్నవాళ్లు ఉన్నారని, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పనని దాగుడు మూతలు ఆడింది. శ్రీరామ్ నాలుగో వారం నుంచే తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, కానీ ఆ విషయం తనకు తెలియలేదంటూ ఎమోషనల్ అయింది. యానీ మాస్టర్ కన్నింగ్, ఫాల్తూ గేమ్ ఆడుతుందంటూ ఉమాదేవి మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బజ్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.