
Bigg Boss Telugu 5, Eliminated Contestant Anee Master Remuneraion: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వచ్చేసింది. కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ 11వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ట్రోఫీతో ఇల్లు చేరాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన యానీ మాస్టర్‌కు ఎంత ముట్టింది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. సెలబ్రిటీల పాపులారిటీని బట్టి బిగ్‌బాస్ టీమ్ ఒక్కో కంటెస్టెంటుకు ఒక్కో రకంగా రెమ్యునరేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న యానీకి షో నిర్వాహకులు బాగానే ముట్టజెప్పారట!
సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం యానీకి ఒక్క వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల మేర పారితోషికం ఇస్తున్నారట! ఈ లెక్కన 11 వారాలకు గానూ ఆమె రూ.30 లక్షల పైచిలుకు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె హౌస్‌లో ఇచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఆధారంగా ఈ రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోనాల్ చెప్పినట్లుగా ఈ డబ్బుతో యానీ సొంతింటి కల నెరవేరుతుందేమో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment