Bigg Boss 5 Telugu: Anee Master Shares Opinions On BB5 Housemates - Sakshi
Sakshi News home page

Anee Master: భారంగా వీడ్కోలు పలికిన యానీ, కాజల్‌ గురించి ఏమందంటే?

Published Sun, Nov 21 2021 11:44 PM | Last Updated on Mon, Nov 22 2021 12:38 PM

Bigg Boss Telugu 5: Evicted Contestant Anee Master Opinion On Housemates - Sakshi

Bigg Boss Telugu 5, Episode 78: వారాలు గడిచేకొద్దీ హౌస్‌లో జనాలు పలుచబడుతున్నారు. జనాలు పలుచబడేకొద్దీ హౌస్‌మేట్స్‌ మధ్య పోటీ పెరుగుతోంది. పోటీ పెరిగేకొద్దీ వారిలో టెన్షన్‌ కూడా పెరుగుతోంది. ఎలాగైనా టాప్‌ 5కి చేరుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే కప్పు కొట్టి తీరాల్సిందేనని మరికొందరు బలంగా ఫిక్సయ్యారు. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న యానీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది. 11వ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. ఈ సందర్భంగా ఆమె హౌస్‌మేట్స్‌కు ఏమని సందేశాన్నిచ్చింది? నాగ్‌ కంటెస్టెంట్లతో ఏమేం గేమ్స్‌ ఆడించాడు? అనేది తెలియాలంటే నేటి(నవంబర్‌ 21) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

కంటెస్టెంట్లు ఒకరి గురించి మరొకరు రాసుకున్న ప్రశ్నలను నాగ్‌ అడిగాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌ నటిస్తున్నాడని, అతడికి పలు ఫేస్‌లు ఉన్నాయని నాగ్‌ చెప్పగా హౌస్‌మేట్స్‌ మాత్రం అలాంటిదేం లేదని అతడు మంచోడని కితాబిచ్చారు. షణ్ముఖ్‌ వల్ల సిరి గేమ్‌లో వెనకబడుతుందా? సిరి-షణ్ను ముందుగా అనుకుని బిగ్‌బాస్‌కు వచ్చారా? అన్న ప్రశ్నలకు సైతం కాదని బదులిస్తూ కంటెస్టెంట్లు సిరికే సపోర్ట్‌ చేశారు.

ప్రియాంకతో నీ ఫ్యూచర్‌ రిలేషన్‌ ఏంటన్న ప్రశ్నకు మానస్‌ ఒక్కముక్కలో ఫ్రెండ్‌షిప్‌ అని తేల్చేశాడు. నువ్వు మానస్‌ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నావని నాగ్‌ ప్రియాంకను సూటిగా అడగ్గా.. ఆమె మంచి ఫ్రెండ్‌షిప్‌ ఆశిస్తున్నానని చెప్పింది. ఎందుకు సిరి వెనకాల ఆమెపై జోక్స్‌ వేస్తావని ప్రియాంకను అడగ్గా ముందు వేసే జోక్సే వెనకాల కూడా వేస్తానని ఆన్సరిచ్చింది పింకీ. నువ్వు బీబీ టైటిల్‌ గెలవడానికి వచ్చావా? గెలిపించడానికి వచ్చావా? నీ బ్రెయిన్‌ ఎప్పుడు వాడతావు? అన్న ప్రశ్నకు తాను టైటిల్‌ గెలవడానికే వచ్చానని సన్నీ.

శ్రీరామ్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అన్న ప్రశ్నకు రవి లేదని చెప్పాడు. చుట్టూ ఉన్నవాళ్లను ఎందుకు వాడుకుంటున్నావన్న ప్రశ్నకు కంటెస్టెంట్లు ఉన్నదే వాడుకోవడానికి అని తెలివిగా ఆన్సరిచ్చాడు. తర్వాత నాగ్‌ కాజల్‌ను సేవ్‌ చేశాడు. అనంతరం 'అనుభవించు రాజా' హీరోహీరోయిన్లు రాజ్‌ తరుణ్‌, కౌశిష్‌, నటుడు నెల్లూరు సుదర్శన్‌ బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేశారు. కాసేపు హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్‌ చేసి అందరినీ సరదాగా నవ్వించారు. 

తర్వాత ఒక్కో డైలాగ్‌ను ఒక్కొక్కరికి అంకితమివ్వాలంటూ ఓ సరదా గేమ్‌ ఆడించాడు నాగ్‌. 'నన్ను రెచ్చగొట్టకు' అన్న డైలాగ్‌ను మానస్‌.. సన్నీకిచ్చాడు. 'నమ్మకం లేదు దొర' డైలాగ్‌ను షణ్ను.. రవికిచ్చాడు. 'సరె సర్లే చాలా చూశాం' అన్న బోర్డును షణ్నుకిచ్చాడు రవి. 'మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా నీలో.. కమల్‌ హాసన్‌' అన్న డైలాగ్‌ బోర్డును యానీ రవికి అంకితమిచ్చింది. 'ఓన్లీ వన్స్‌ ఫసక్‌' బోర్డును ప్రియాంక.. మానస్‌కు ఇచ్చింది.

'ఏమో సర్‌, నాకు కనబడదు' డైలాగ్‌ షణ్నుకు సరిగ్గా సెట్టవుతుందన్నాడు శ్రీరామ్‌. 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అనేది షణ్నుకు, తనకు ఇద్దరికీ సెట్టవుతుందని చెప్పింది సిరి. 'నీ బొందరా నీ బొంద' డైలాగ్‌ను శ్రీరామ్‌కు అకింతమిచ్చింది కాజల్‌. 'అయిపాయే' అనేది రవికి సెట్టవుతుందన్నాడు సన్నీ. అనంతరం సిరి, ప్రియాంక సేఫ్‌ అవగా యానీ ఎలిమినేట్‌ అయింది.

అనంతరం యానీ హౌస్‌మేట్స్‌తో మాట్లాడింది. మంచి తమ్ముడిగా ఉన్నందుకు రవికి థ్యాంక్స్‌ చెప్పింది. శ్రీరామ్‌ మంచి ఫ్రెండ్‌ అంది. షణ్ముఖ్‌ ఎప్పుడూ ఉన్నదున్నట్లు మాట్లాడతాడంది. సిరి పటాకలా ఆడుతుందని పొగిడింది. ప్రియాంక.. సీతాకోక చిలుక అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది. బయటకొచ్చాక మానస్‌తో మంచి ఫ్రెండ్‌ అవుతానంది. సన్నీ తన ఫ్రెండ్‌ అని, అతడిని మిస్‌ అవుతానంది. కాజల్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదని పెదవి విరించింది. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

తర్వాత మానస్‌కు ఒక ప్రేక్షకుడు పంపిన వాయిస్‌ మెసేజ్‌ను వినిపించారు. మొన్నటివరకు బాగా ఆడారు. కానీ ఈ మధ్య పింకీతో కలిసి కంటెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకు? అని అతడు ప్రశ్నించాడు. దీనికి మొదట షాకైన మానస్‌ కాసేపటికే తేరుకుని పింకీతో తనకు బాండ్‌ ఏర్పడిందన్నాడు. ఇది కంటెంట్‌ ఇవ్వడం కాదని క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement