
సోమవారం జరిరిగిన నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ ఇళ్లంతా గంభీరంగా మారింది. ఆరోవారంలో అత్యధికంగా 10 మంది( షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ )నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే..నామినేషన్ ప్రక్రియతో బాగా హర్ట్ అయిన ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడ్డాడు బిగ్‌బాస్.
ఇందులో భాగంగా.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బొమ్మల కోసం హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ఇక జెస్సీ మాత్రం శ్వేతాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. టాస్క్‌లో భాగంగా.. యానీ మాస్టర్ 'నేను యాక్సెప్ట్ చేయను.. నేను గొడవ చేస్తా' అంటూ కాజల్-సిరిలతో చెప్పగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను' అంటూ సిరి చెప్పకొచ్చింది. 'నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు' అంటూ యానీ మాస్టర్ సిరికి వార్నింగ్ ఇచ్చింది. మరి యానీ-సిరిల గొడవ ఎక్కడికి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment