Bigg Boss Telugu 5: Sreerama Chandra Name Trending on Twitter With Pride of BB5 Sreeram - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ట్విటర్‌లో మోత మోగుతున్న శ్రీరామ్‌ పేరు

Published Sun, Oct 24 2021 5:42 PM | Last Updated on Sun, Oct 24 2021 7:57 PM

Bigg Boss Telugu 5: Sreerama Chandra Name Trending on Twitter With Pride of BB5 Sreeram - Sakshi

Bigg Boss 5 Telugu, Pride Of BB5 Sreeram Trending In Twitter:బిగ్‌బాస్‌ షోలో మిస్టర్‌ కూల్‌ ఎవరు అనగానే రెండు పేర్లు వినిపిస్తాయి. ఒకటి మానస్‌, మరొకటి శ్రీరామచంద్ర. ఏదైనా గొడవ జరిగినప్పుడు మానస్‌ ముఖం కోపంతో ఎర్రబడుతుంది కానీ శ్రీరామ్‌ ఫేస్‌లో మాత్రం స్మైలే కనిపిస్తుంది. టాస్క్‌ అయినా, గొడవైనా, మరేదైనా సరే తన ముఖం మీద చిరునవ్వు చెదరనీయడీ సింగర్‌. తనకు బిగ్‌బాస్‌ ట్రోఫీ, ప్రైజ్‌మనీ కన్నా తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వడమే ముఖ్యమని చెప్పిన వ్యక్తి ఈయన.

ఈ సీజన్‌లో టాప్‌ 5కి చేరుకునేవారిలో శ్రీరామ్‌ తప్పకుండా ఉంటాడని ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్తున్నారు. టైటిల్‌ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే గెలిచే అవకాశాలు కాదు, గెలవడం పక్కా అంటున్నారు ఆయన అభిమానులు. తాజాగా శ్రీరామ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో దుమ్ము లేపుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి #PrideOfBB5Sreeram అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌కు శ్రీరామ్‌ కింగ్‌ అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం 24 గంటల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌తో లక్షకు పైగా ట్వీట్లు చేయడం విశేషం.

మొన్నటివరకు ఓ రేంజ్‌లో ఆడి రెచ్చిపోయిన శ్రీరామ్‌ ఈమధ్య కాస్త డల్‌ అయ్యాడు. హమీదా వెళ్లిపోయినప్పటి నుంచి అతడి స్క్రీన్‌ స్పేస్‌ బాగా తగ్గిపోయింది. అయితే అతడు వీలైనంత త్వరగా మామూలైపోయి ఎప్పటిలాగే ఎంటర్‌టైన్‌ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్‌. 'తిరిగి ఫామ్‌లోకి రావడానికి కొంచెం లేట్‌ అవుతుందేమో కానీ విన్‌ అవ్వడం మాత్రం పక్కా, రాసిపెట్టుకోండి', 'అతడు హౌస్‌లో ఒంటరివాడయ్యాడేమో కానీ బయటకు వచ్చాక మాత్రం కాదు' అంటూ పంచ్‌ డైలాగులు విసురుతున్నారు. వీరికి తోడుగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా శ్రీరామ్‌కు అండగా నిలబడ్డ విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement