
Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరదించనుంది. ప్రేక్షకులు ఎవరిని గెలిపించారనే విషయం పక్కకు పెడితే హౌస్‌మేట్స్ మనసులు గెలుచుకుంది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. గ్రాండ్ ఫినాలేలో నాగార్జున బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ముచ్చటించారు. టాప్ 5లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్నకు హౌస్‌మేట్స్ వారి అభిప్రాయాలను వెల్లడించారు.
రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్ ఇవ్వగా శ్వేత, నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రియాంక సింగ్ మాత్రం ఏకంగా ముగ్గురి పేర్లను వెల్లడించింది. మానస్, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరు గెలిచినా ఓకే అని చెప్పింది. వీళ్ల అభిప్రాయం ప్రకారం శ్రీరామ్ విన్నర్ అయితే సన్నీ రన్నర్‌గా నిలుస్తాడన్నమాట. మరి వీరి అంచనా ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment