
Syed Sohel Ryan Predicted About Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే రెండు వారాలు ఆగాల్సి ఉంది. కానీ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేది ముందుగానే జోస్యం చెప్తున్నాడు సోహైల్. బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన సోహైల్ ఈ సీజన్‌పై మాట్లాడటానికి చాలావరకు తటపటాయించాడు. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకరికి సపోర్ట్ చేసి మిగతావారి ఫ్యాన్స్ నుంచి విమర్శలు మూటగట్టుకోవడం ఎందుకని ఎవరికీ మద్దతు పలకకుండా వెనకడుగు వేశాడు.
కానీ హౌస్‌లో ఉన్న సన్నీని చూసి తనను తాను చూసుకున్నట్లు ఉందంటూ మురిసిపోయాడు సోహైల్. ఆ మధ్య సన్నీ విన్నర్ అవుతాడంటూ ఏకంగా పోస్ట్ కూడా పెట్టాడు. సన్నీతో పాటు కాజల్, మానస్ కూడా ఫినాలేలో ఉంటారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కానీ మిగతా కంటెస్టెంట్ల ఫ్యాన్స్ తన మీద యుద్ధానికి రావడంతో ఆ పోస్ట్‌నే డిలీట్ చేశాడు. అప్పటినుంచి ఈ షో గురించి మాట్లాడాలంటేనే జంకుతున్నాడు.
తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. 'ఎవరికి సపోర్ట్ చేసినా.. మావాడు ఏం చేశిండు? మా పిల్ల ఏం చేసింది? అని నన్ను వేసుకుంటున్నారు. కాజల్, మానస్, సన్నీ టాప్‌లో ఉంటారనిపిస్తుందని పోస్ట్ పెట్టా.. మా వాళ్లు ఎటు పోతారంటూ అందరూ నన్ను గట్టిగా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలు స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా ఎందుకులే అని భయం వేసింది. పోస్ట్ డిలీట్ చేశా. ఈ వారమైతే సిరి, కాజల్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. నాకు నచ్చిన కంటెస్టెంట్లు శ్రీరామ్, సన్నీ. వీళ్లిద్దరిలో ఒకరు టైటిల్ గెలుస్తారు' అని సోహైల్ జోస్యం పలికాడు.
Comments
Please login to add a commentAdd a comment