
Bigg Boss 5 Telugu, 5th Week Nominations: సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టే నామినేషన్స్ ఉన్న మండేనే అసలైన ఫండే అంటారు బిగ్‌బాస్ వీక్షకులు. ఎప్పటిలాగే ఈ వారం కూడా కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియకు రెడీ అయిపోయారు. గేమ్ సరిగా ఆడలేకపోతున్నవారితో పాటు, గ్రూపిజం చేస్తూ తమ మీద ప్రతాపాన్ని చూపిస్తున్న కంటెస్టెంట్లను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
అయితే ఈసారి బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను భిన్నంగా నిర్వహించాడు. ముఖాముఖిగా నామినేషన్స్ జరపకుండా సీక్రెట్ రూమ్‌కి పిలిచి నామినేట్ చేయాలనుకుంటున్నవారి పేర్లు, అందుకు తగిన కారణాలను చెప్పమని ఆదేశించాడు. అయితే సన్నీ.. ఇలా సీక్రెట్‌గా కాకపోయినా, బయట నామినేషన్స్ జరిగినా ఈ రెండు పేర్లే చెప్దామని డిసైడ్ అయ్యాను అని పేర్కొన్నాడు.
కాజల్.. తన స్ట్రాటజీ ప్రకారం.. తనను నామినేట్ చేసినవాళ్లనే నామినేట్ చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. లోబో.. ఇంటిసభ్యుల్లోని కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. నేనా రోజు సైలెంట్‌గా మాట్లాడుంటే షణ్ముఖ్ ఎవరిని నామినేట్ చేసేవాడని ప్రశ్నించాడు. ఇక రవి.. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని జెస్సీ నా పేరు ట్యాగ్ చేయడం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనిపిస్తుందంటూ అతడిని నామినేట్ చేశాడు. సింగర్ శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్, జెస్సీ గ్రూపిజం చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇలా అందరూ వారివారి కారణాలు చెప్తూ నామినేట్ చేశారు.
అయితే నామినేషన్స్‌కు సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తవడంతో ఈవారం ఎవరెవరు నామినేట్ అయ్యారనే లిస్టు సోషల్ మీడియాలో లీకైంది. అనూహ్యంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో యాంకర్ రవి, మానస్, సన్నీ, షణ్ముఖ్, సిరి, ప్రియ, విశ్వ, లోబో, హమీదా, జెస్సీ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సారి నామినేషన్‌లో ఊహించని కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ మరింత ఆసక్తికరంగా మారింది!
Comments
Please login to add a commentAdd a comment