
Sreerama Chandra In Bigg Boss 5 Telugu: సింగర్ శ్రీరామచంద్ర.. 2010లో 'ఇండియన్ ఐడల్ షో' విన్నర్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యాడు. ఆయన ఇప్పటివరకు 9 భాషల్లో కలిపి 500కు పైగా పాటలు పాడాడు. అందులో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. అయితే తాను తెలుగు పాటలు ఎక్కువగా పాడాలనుకుంటున్నానని చెప్తున్నాడు. తాజాగా అతడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
తను నిజంగా శ్రీరామచంద్రుడినే అంటున్న అతడు తన గాత్రంతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తానంటున్నాడు. ఆ మధ్య 'శ్రీ జగద్గురు ఆది శంకర' సినిమాలోనూ నటించాడు. బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరవుతానని కొండంత ఆశతో హౌస్‌లో అడుగుపెట్టాడు శ్రీరామచంద్ర. చూడటానికి సున్నితంగా కనిపించే అతడు టాస్క్‌ల్లో ఎలా ఆడతాడు? తోటి కంటెస్టెంట్లను ఎలా డీల్ చేస్తాడన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.